2022 ఐసీసీ ప్రపంచ కప్ షెడ్యూల్ విడుదల...
- December 15, 2020
ఈ ఏడాది కరోనా క్రికెట్ ప్రపంచానికి చాల నష్టం కలిగించింది. ఈ కోవిడ్ వైరస్ కారణంగా పదుల సంఖ్యలో ద్వైపాక్షిక సిరీస్లు వాయిదా పడ్డాయి. అలాగే ముఖ్యమైన ఆసియా కప్, ఐసీసీ టీ 20 ప్రపంచ కప్ టోర్నమెంట్లతో పాటుగా వచ్చే ఏడాది జరగాల్సిన మహిళల వన్డే ప్రపంచ కప్ ను కూడా ఐసీసీ 2022 కి వాయిదా వేసిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు 2022 లో జరిగే మహిళల వన్డే ప్రపంచ కప్ ప్రపంచ కప్ షెడ్యూల్ వచ్చేసింది. న్యూజిలాండ్ వేదికగా 2022 మార్చి 4 న ఈ టోర్నీ ప్రారంభం అవుతుంది. అందులో భారత జట్టు మార్చి 6 న తన మొదటి మ్యాచ్ ఆడుతుంది. అయితే మొత్తం 8 జట్లు పాల్గొనే ఈ టోర్నీకి ఇప్పటివరకు 'ఇండియా, న్యూజిలాండ్ ఆస్ట్రేలియా , ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా' 5 జట్లు మాత్రమే అర్హత సాధించాయి. ఇక మిగిలిన మూడు స్థానాలకు పోటీ పడుతున్న 10 జట్లు శ్రీలంక వేదికగా జరగనున్న ఐసీసీ ఉమెన్స్ క్రికెట్ ప్రపంచ కప్ క్వాలిఫైయర్ మ్యాచ్ లు ఆడవలసి ఉంది. మరి ఈ మ్యాచ్ లు ఎప్పుడు నిర్వహిస్తారు అనేది అనేది ఐసీసీ ఇంకా ప్రకటించలేదు. అయితే మొత్తం 31 మ్యాచ్ లు జరగనున్న ఈ టోర్నీ ఫైనల్ మ్యాచ్ ఏప్రిల్ 3న జరుగుతుంది.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష