వైఎస్ఆర్ ఉచిత పంటల భీమా పథకం ప్రారంభం
- December 15, 2020
అమరావతి: ఏపి సిఎం జగన్ వైఎస్ఆర్ ఉచిత పంటల భీమా పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం ద్వారా 2019 సీజన్లో పంట నష్టపోయిన 9.48 లక్షల మంది రైతులకు దాదాపు రూ.1,252 కోట్ల బీమా పరిహారం దక్కనుంది. తాడేపల్లిలోని సిఎం క్యాంపు కార్యాలయంలో కంప్యూటర్ బటన్‌నొక్కి నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో ఈ మెత్తాన్ని జమచేశారు. ఈ సందర్భంగా సిఎం జగన్ మాట్లాడుతూ… ‘వైఎస్ఆర్ పంటల భీమా పథకంతో మరో అడుగు ముందుకు వేశాం. గతంలో పంటల భీమా పథకంలో చేరేందుకు రైతులు నిరాకరించేవారు. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతుల ప్రీమియం కూడా.. ప్రభుత్వమే చెల్లించాలని నిర్ణయం తీసుకున్నాం. 2019లో పంట నష్టపోయిన 9.48 లక్షల మంది రైతులకు.. రూ.1252 కోట్ల భీమా సొమ్మును అందిస్తున్నాం. ఇన్సూరెన్స్ ప్రీమియం రైతులకు గుదిబండ కాకూడదు. పంట నష్టం జరిగితే భీమా వస్తుందన్న నమ్మకం రైతుల్లో కలగాలి. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఉచిత పంటల బీమాను అందిస్తున్నాం.. అన్నారు.
తాజా వార్తలు
- అక్టోబర్‌లోనే స్థానిక ఎన్నికలు..మంత్రి లోకేశ్ కీలక ప్రకటన
- రాస్ అల్ ఖైమాలో నిర్మాణ రసాయనాల తయారీ యూనిట్‌ను ప్రారంభించిన జేకే సిమెంట్
- ADIHEX ప్రదర్శనను సందర్శించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో నకిలీ ఫ్రీలాన్స్ వీసాల వ్యవహారం..వ్యక్తి అరెస్ట్
- సౌదీ అరేబియాలో డిజిటల్ వినియోగానికి ప్రోత్సాహం..!!
- యూఏఈలో సైబర్ దాడుల ముప్పు.. స్మార్ట్ హోమ్, కార్లు లక్ష్యం..!!
- ఖతార్ ఫిన్‌టెక్ దూకుడు.. 2034 నాటికి QR7.55 బిలియన్లకు మార్కెట్..!
- రీసైకిల్ టైర్లతో రహదారుల నిర్మాణానికి కువైట్ సన్నాహాలు..!!
- మునిగిన పడవ.. ఇద్దరు యువకులను రక్షించిన ఫిషర్ మెన్..!!
- బహ్రెయిన్ యువత అభివృద్ధిలో ‘గదేహా’ శిక్షణ కీలకం..!!







