కోవిడ్ వ్యాక్సిన్ ఫైజర్ కు ఒమన్ గ్రీన్ సిగ్నల్...
- December 16, 2020
మస్కట్:కోవిడ్ 19కు విరుగుడుగా మార్కెట్లోకి వచ్చిన ఫైజర్-బయోఎన్‌టెక్ వ్యాక్సిన్ కు ఒమన్ ఆరోగ్య శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కోవిడ్ నియంత్రణకు అత్యవసరంగా ఫైజర్ వ్యాక్సిన్ ను దిగుమతి చేసుకునేందుకు అనుమతులు మంజూరు చేసింది. ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఔషధ నియంత్రణ అధికార విభాగం జనరల్ డైరెక్టరేట్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వ సమాచార కేంద్రం ఓ ప్రకటనలో వివరించింది. అన్ని దశల్లో ఫైజర్ వ్యాక్సిన్ కోవిడ్ 19 వైరస్ ను నియంత్రించేందుకు సమర్ధవంతంగా పని చేసిందని గత నవంబర్ 26న ఆ సంస్థ విడుదల చేసిన ప్రయోగ ఫలితాలు విడుదల చేసిన విషయం తెలిసిందే. దీనికితోడు యూకే, కెనడాతో పాటు అమెరికా ఫుడ్, డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ కూడా ఫైజర్ కు తుది అనుమతులు ఇవ్వటం..బ్రిటన్ లో ఇప్పటికే వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో కువైట్ ఆరోగ్య శాఖ ఫైజర్ దిగుమతికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వ్యాక్సిన్ ను మూడు వారాల్లో రెండు డోసులు ఇవ్వనున్నట్లు వెల్లడించింది.
--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఒమన్)
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు