సోనియాగాంధీతో కోమటిరెడ్డి వెంకటరెడ్డి భేటీ.. ఢిల్లీకి రేవంత్ రెడ్డి
- December 16, 2020
న్యూ ఢిల్లీ:తెలంగాణ పీసీసీ చీఫ్ పదవి కోసం పోటీ తీవ్రమైంది. ఇప్పటి వరకు ఏఐసీసీ ఇంఛార్జికి మొరపెట్టుకున్న నేతలు.. ఇప్పుడు ఓ అడుగు ముందుకు వేశారు. ఏకంగా అధినేత్రితో భేటీ అవుతున్నారు. తెలంగాణ కాంగ్రెస్ సారథ్య బాధ్యతలు ఆశిస్తున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి.. సోనియా గాంధీని కలిశారు. తనకే పీసీసీ చీఫ్ పదవి ఎందుకివ్వాలో చెప్పుకున్నారు. పార్టీలో కొత్తగా వచ్చిన వ్యక్తులకు పీసీసీ పదవి ఇస్తే.. జరగబోయే పరిణామాలను కూడా సోనియా గాంధీకి వివరించినట్టు సమాచారం.
నిజానికి తెలంగాణ పీసీసీ చీఫ్ నియామకాన్ని కొన్నాళ్ల పాటు వాయిదా వేద్దామనుకుంది కేంద్ర నాయకత్వం. నాగార్జున సాగర్ ఉప ఎన్నికల తరువాత పీసీసీ చీఫ్‌ను నియమించాలనుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. పీసీసీ పదవి కోసం జానారెడ్డి పోటీపడుతున్నారు. పైగా నాగార్జున సాగర్ నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేయాల్సింది కూడా జానారెడ్డినే. ఈ పరిస్థితుల్లో మరొకరికి పీసీసీ చీఫ్ పదవి ఇస్తే.. ఆయన డైరెక్షన్లో జానారెడ్డి నడుస్తారా అన్న అనుమానాలను ఢిల్లీ నాయకత్వం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు