హ్యూమన్ ట్రాఫికింగ్: సస్పెండెడ్ కంపెనీలకు భారీ జరీమానాలు
- December 16, 2020
కువైట్ సిటీ:హ్యూమన్ ట్రాఫికింగ్ చట్టాల ఉల్లంఘనకు పాల్పడే కంపెనీలకు భారీ జరీమానాలు విధించడం జరుగుతుందని పబ్లిక్ అథారిటీ ఫర్ మేన్ పవర్ వెల్లడించింది. 10,000కి పైగా సస్పెండెడ్ కంపెనీలపై పిఎఎం నిఘా వుంచింది. పాత కోడ్స్‌ని తొలగించి, కొత్త కోడ్స్ ద్వారా వీటిపై చర్యలు తీసుకోనున్నారు. వీసా ట్రేడింగ్, వర్కర్స్ రైట్స్ ఉల్లంఘన, జీతాలు చెల్లించకపోవడం వంటి ఉల్లంఘనల్ని తీవ్రంగా పరిగణించనున్నారు. ఉల్లంఘనలకు సంబంధించి కంపెనీలకు స్పష్టమైన హెచ్చరికలు జారీ చేయడంతోపాటు, కార్మికుల హక్కులకు భంగం వాటిల్లకుండా ప్రత్యేకమైన చర్యలు తీసుకుంటారు. పిఎఎం అలాగే మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ మధ్య ప్రత్యేక మెకానిజం ఏర్పాటు చేసి.. ఆయా అంశాలపై వేగంగా చర్యలుండేలా చూస్తారు.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్‌గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్‌పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







