హ్యూమన్‌ ట్రాఫికింగ్‌: సస్పెండెడ్‌ కంపెనీలకు భారీ జరీమానాలు

- December 16, 2020 , by Maagulf
హ్యూమన్‌ ట్రాఫికింగ్‌: సస్పెండెడ్‌ కంపెనీలకు భారీ జరీమానాలు

కువైట్ సిటీ:హ్యూమన్‌ ట్రాఫికింగ్‌ చట్టాల ఉల్లంఘనకు పాల్పడే కంపెనీలకు భారీ జరీమానాలు విధించడం జరుగుతుందని పబ్లిక్‌ అథారిటీ ఫర్‌ మేన్‌ పవర్‌ వెల్లడించింది. 10,000కి పైగా సస్పెండెడ్‌ కంపెనీలపై పిఎఎం నిఘా వుంచింది. పాత కోడ్స్‌ని తొలగించి, కొత్త కోడ్స్‌ ద్వారా వీటిపై చర్యలు తీసుకోనున్నారు. వీసా ట్రేడింగ్‌, వర్కర్స్‌ రైట్స్‌ ఉల్లంఘన, జీతాలు చెల్లించకపోవడం వంటి ఉల్లంఘనల్ని తీవ్రంగా పరిగణించనున్నారు. ఉల్లంఘనలకు సంబంధించి కంపెనీలకు స్పష్టమైన హెచ్చరికలు జారీ చేయడంతోపాటు, కార్మికుల హక్కులకు భంగం వాటిల్లకుండా ప్రత్యేకమైన చర్యలు తీసుకుంటారు. పిఎఎం అలాగే మినిస్ట్రీ ఆఫ్‌ ఇంటీరియర్‌ మధ్య ప్రత్యేక మెకానిజం ఏర్పాటు చేసి.. ఆయా అంశాలపై వేగంగా చర్యలుండేలా చూస్తారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com