జనవరిలో `గాలి సంపత్` చివరి షెడ్యూల్.
- December 17, 2020
హైదరాబాద్:బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి సమర్పిస్తూ, స్క్రీన్ ప్లే అందిస్తున్న చిత్రం 'గాలి సంపత్`. అనిల్ కో డైరెక్టర్, రైటర్, మిత్రుడు ఎస్. క్రిష్ణ నిర్మాతగా ఇమేజ్ స్పార్క్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ ను స్థాపించి షైన్ స్క్రీన్స్ తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. యంగ్ హీరో శ్రీ విష్ణు, లవ్లీ సింగ్ హీరోహీరోయిన్లుగా, నటకిరీటి డా. రాజేంద్ర ప్రసాద్ గాలి సంపత్‌గా టైటిల్ రోల్ పోషిస్తున్న ఈ మూవీ అనీష్ దర్శకత్వంలో రూపొందుతోంది. ఇటీవల అరుకులో ప్రారంభమైన ఈ సినిమా మొదటి షెడ్యూల్ పూర్తయ్యింది. ఈ సందర్భంగా..
చిత్ర నిర్మాత ఎస్. క్రిష్ణ మాట్లాడుతూ - `` ఇటీవల ప్రారంభించిన అరకు షెడ్యూల్ పూర్తయ్యింది. మేం ప్లాన్ చేసిన విధంగా ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ సపోర్ట్‌తో షూటింగ్ సజావుగా సాగింది. ఇప్పటివరకూ 80% టాకీపార్ట్ పూర్తయ్యింది. జనవరి 18 తర్వాత హైదరాబాద్‌లో జరిగే చివరి షెడ్యూల్‌తో షూటింగ్ పూర్తవుతుంది. తండ్రీ కొడుకుల మధ్య ముందెన్నడూ చూడని ఒక డిఫరెంట్ ఎమోషన్ తో అనిల్ రావిపూడి మార్క్ ఎంటర్టైన్ మెంట్‌తో బ్యూటిఫుల్ జర్నీగా ఈ సినిమా తెరకెక్కుతోంది``అన్నారు.
నటకిరీటి రాజేంద్ర ప్రసాద్, శ్రీ విష్ణు, లవ్లీ సింగ్, తనికెళ్ల భరణి, సత్య, రఘుబాబు, శ్రీకాంత్ అయ్యంగార్, మిర్చి కిరణ్, సురేంద్ర రెడ్డి, గగన్, మిమ్స్ మధు, అనీష్ కురువిల్లా, రజిత, కరాటే కళ్యాణి, సాయి శ్రీనివాస్, రూపలక్ష్మి తదితరులు నటిస్తోన్న ఈ చిత్రానికి,
కథ: ఎస్. క్రిష్ణ,
స్క్రీన్ ప్లే: అనిల్ రావిపూడి,
రచనా సహకారం: ఆదినారాయణ,
సినిమాటోగ్రఫి: సాయి శ్రీ రామ్,
సంగీతం: అచ్చు రాజమణి,
ఆర్ట్: ఎ ఎస్ ప్రకాశ్,
ఎడిటర్: తమ్మిరాజు,
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: నాగమోహన్ బాబు. ఎమ్,
మాటలు: మిర్చి కిరణ్,
లిరిక్స్: రామజోగయ్య శాస్ర్తి,
ఫైట్స్: నభ,
కొరియోగ్రఫి: శేఖర్, భాను,
మేకప్: రంజిత్,
కాస్టూమ్స్: వాసు,
చీఫ్ కో డైరెక్టర్: సత్యం బెల్లంకొండ.
నిర్మాణం: ఇమేజ్ స్పార్క్ ఎంటర్ టైన్మెంట్,షైన్ స్క్రీన్స్,
సమర్పణ: అనిల్ రావిపూడి,
నిర్మాత: ఎస్. క్రిష్ణ,
దర్శకత్వం: అనీష్
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు