తెలంగాణలో 509 కరోనా కేసులు
- December 17, 2020
హైదరాబాద్:తెలంగాణలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గతంలో వేలల్లో నమోదయ్యే పాజిటివ్ కేసులు.. కరోనా కట్టడిలో భాగంగా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. తాజాగా గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 48,652 మందికి కరోనా పరీక్షలు నిర్వహంచగా, 509 పాజిటివ్ కేసుల నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్ లో తెలిపింది. ఇక తాజాగా ముగ్గురు మృతి చెందగా, ఇప్పటి వరకు రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 1,505కు చేరుకుంది. ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసులు సంఖ్య 2,79,644కు చేరుకుంది.
తాజాగా కరోనా నుంచి 517 మంది కోలుకోగా, ఇప్పటి వరకు రాష్ట్రంలో 2,70,063 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 7,172 యాక్టివ్ కేసులు ఉన్నాయని, వారిలో 5,063 మంది హోం ఐసోలేషన్ లో చికిత్స పొందుతున్నట్లు తెలిపింది. తెలంగాణలో ఇప్పటి వరకు 63,06,397 కరోనా పరీక్షలు నిర్వహించారు.
--హరి(మాగల్ఫ్ ప్రతినిధి,తెలంగాణ)
తాజా వార్తలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్‌గా హైదరాబాద్..
- ఉక్రెయిన్ పై రష్యా క్షిపణుల దాడి.. 12 మంది మృతి!
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్‌లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్‌లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!







