జనవరి నుంచి అన్ని దేశాలకూ విమానాలు.!
- December 17, 2020
కువైట్ సిటీ:కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి అన్ని దేశాలకూ విమానాల రాకపోకలు సాగించే అవకాశం వున్నట్లు తెలుస్తోంది. ఇప్పటిదాకా 34 దేశాలకు చెందిన విమానాలపై ఆంక్షలు వున్న విషయం విదితమే. హెల్త్ అథారిటీస్, దేశంలోకి డొమెస్టిక్ వర్కర్స్ రాకపోకలకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకోనున్నాయి. కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తున్న దరిమిలా, ఆంక్షల్ని పూర్తిస్థాయిలో సడలించడానికి మార్గం సుగమం అవుతోంది. పలు అంశాల్ని పరిగణనలోకి తీసుకుని, మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ తీసుకునే కీలక నిర్ణయాన్ని బట్టి ప్రయాణీకుల రాకపోకలపై ఆంక్షలు తొలగిస్తారు. కాగా, హోటల్ విభాగానికి చెందిన ఆయా సంస్థల్ని ఆహ్వానించి, తప్పనిసరి క్వారంటైన్ పీరియడ్‌ని తగ్గించేలా సూచనలు చేయనున్నాయి సంబంధిత అతారిటీస్.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!







