భార‌త్‌లో కోటి దాటిన కరోనా కేసులు

- December 19, 2020 , by Maagulf
భార‌త్‌లో కోటి దాటిన కరోనా కేసులు

న్యూ ఢిల్లీ:భారత దేశంలో క‌రోనా కేసులు కొత్త రికార్డు సృష్టించాయి.ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఇప్ప‌టికే 7 కోట్ల మార్క్‌ను దాటేసి పాజిటివ్ కేసులు 8 కోట్ల వైపు ప‌రుగులు పెడుతుండ‌గా... భార‌త్‌లో కోటి మార్క్‌ను క్రాస్ చేశాయి క‌రోనా వైర‌స్ పాజిటివ్ కేసులు.. అయితే, రోజువారి కేసుల సంఖ్య ఓ ద‌శ‌లో దాదాపు ల‌క్ష‌కు చేరువై క్ర‌మంగా త‌గ్గుముఖం ప‌డుతోంది.. కానీ, ఓరోజు కింద‌కు.. మ‌రోరోజు పైకి క‌దులుతూనే ఉంది.. క‌రోనా ట్యాలీ.. కేంద్ర ఆరోగ్య‌శాఖ విడుద‌ల చేసిన తాజా క‌రోనా బులెటిన్ ప్ర‌కారం.. భార‌త్‌లో క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య కోటి దాటింది... గ‌త 24 గంట‌ల్లో 25,153 పాజిటివ్ కేసులు న‌మోదు కాగా... 347 మంది మృతిచెందారు.. దీంతో పాజిటివ్ కేసుల సంఖ్య  1,00,04,599కు చేరుకోగా.. మృతుల సంఖ్య‌ 1,45,136కు పెరిగింది. ఇక‌, ఇప్ప‌టి వ‌ర‌కు క‌రోనాబారిన‌ప‌డి 95,50,712 మంది కోలుకున్న‌ట్టు బులెటిన్‌లో పేర్కొంది కేంద్రం.. ప్ర‌స్తుతం.. దేశ‌వ్యాప్తంగా 3,08,712 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక‌, శుక్ర‌వారం రోజు దేశ్యాప్తంగా 11,71,868 క‌రోనా టెస్ట్‌లు నిర్వ‌హించ‌గా.. ఇప్ప‌టి వ‌ర‌కు నిర్వ‌హించిన టెస్ట్‌ల సంఖ్య 16,00,90,514కు పెరిగింది.. 

ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 7 కోట్ల 60లక్షలు దాటేసింది.అలాగే కరోనా మృతుల సంఖ్య 16లక్షల 81 వేల 79కి చేరింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com