చుండ్రు తగ్గాలంటే...

- December 19, 2020 , by Maagulf
చుండ్రు తగ్గాలంటే...

చాలా మందిని వేధించే సమస్యల్లో చుండ్రు ఒకటి. కొందరిలో జుట్టు రాలిపోవడం, వెంట్రుకలు తెల్లబడటం లాంటి సమస్యలతోపాటు చుండ్రు కూడా ఇబ్బందికి గురి చేస్తుంది. తలపై చుండ్రు పేరుకుపోవడం వల్ల చిరాకు కలుగుతుంది. ఫలితంగా ఏకాగ్రత దెబ్బతింటుంది. చుండ్రు సమస్య నుంచి బయటపడేందుకు పాటించాల్సిన చిట్కాలు..

- రాత్రి పూట మెంతుల్ని నీటిలో నానబెట్టి తెల్లవారాక రుబ్బి ఆ మిశ్రమాన్ని తలకు పట్టించాలి. ఓ గంటసేపు ఆగి షాంపూ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చుండ్రు తగ్గడమే కాకుండా మాడు కూడా చల్లబడుతుంది.

- వేప నూనె, ఆలివ్ ఆయిల్‌ను సమాన మోతాదులో కలిపి వేడి చేయాలి. ఆ మిశ్రమం గోరు వెచ్చగా ఉన్నప్పుడే వెంటుకలకు, మాడుకు రాసుకోవాలి. అలా ఉంచాక పావుగంట ఆగి షాంపూ చేసుకోవాలి.

- చిన్న అల్లం ముక్క తీసుకొని సన్నని ముక్కలుగా తరిగి నువ్వల నూనెలో వేయాలి. ఆ నూనెతో తలకు మర్దనా చేసుకోవాలి. రాత్రి నిద్రపోయే ముందు తలకు రాసుకొని ఉదయానే షాంపూ చేయాలి. ఇలా వారానికి మూడు సార్లు చేస్తే చుండ్రు తగ్గుముఖం పడుతుంది.

- కలబంద గుజ్జును మాడుకు పట్టించి పావుగంట తర్వాత షాంపూ చేయాలి. వారానికి మూడు సార్లు ఇలా చేయడం వల్ల చుండ్రు సమస్య తగ్గడమే కాకుండా వెంట్రుకలు మృదువుగా మారతాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com