హైదరాబాద్ విమానాశ్రయానికి 'తెలంగాణ రాష్ట్ర ఇంధన పొదుపు పురస్కారం – 2020'

- December 21, 2020 , by Maagulf
హైదరాబాద్ విమానాశ్రయానికి \'తెలంగాణ రాష్ట్ర ఇంధన పొదుపు పురస్కారం – 2020\'

హైదరాబాద్: GMR ఆధ్వర్యంలోని హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ (GHIAL) "తెలంగాణ రాష్ట్ర ఇంధన పొదుపు పురస్కారాలు-2020 (TSECA)"లో ప్రతిష్టాత్మక స్వర్ణ పురస్కారాన్ని పొందింది. ఇంధన పరిరక్షణలో GHIAL తీసుకున్న కార్యక్రమాలకు ఈ అవార్డును ప్రదానం చేశారు.

డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల సంస్థలోని అక్షర హాలులో ఇంధన పొదుపు వారోత్సవాల చివరి రోజు (20 డిసెంబర్ 2020) పరిశ్రమ ప్రముఖుల మధ్య డి. ప్రభాకరరావు, సీఎండీ, ట్రాన్స్‌కో మరియు జెన్‌కో, తెలంగాణ మరియు సందీప్ కుమార్ సుల్తానియా, సెక్రటరీ, పీఆర్ అండ్ ఆర్డీ, అందజేసిన అవార్డును GHIAL సీనియర్ అధికారులు అందుకున్నారు. 

తమ రోజువారీ కార్యకలాపాలలో ఇంధన పొదుపు రీత్యా ఉత్తమ పద్ధతులు మరియు సాంకేతిక పురోగతిని అవలంబించే సంస్థలను ఈ వార్షిక ఫోరం గుర్తిస్తుంది. న్యాయనిర్ణేతలు ఈ పోటీలో పాల్గొన్న సంస్థలకు సంబంధించిన విాల్గొన్న సంస్విధ కార్యకలాపాలను, వినూత్న ఆలోచన ప్రక్రియలను పరిశీలించారు.

ప్రదీప్ పణికర్, సీఈఓ, GHIAL, ఈ అవార్డుపై మాట్లాడుతూ, “ఈ పురస్కారం ఇంధన పొదుపు, పర్యావరణ సుస్థిరత విషయంలో మా నిబద్ధతకు నిదర్శనం. సామాజిక బాధ్యతాయుత సంస్థగా మేము ఉత్తమ ఇంధన పొదుపు చర్యలకు కట్టుబడి ఉన్నాము. GHIAL యొక్క ఇంధన, జల సంరక్షణ కార్యక్రమాలు అనేక పరిశ్రమ వేదికల మీద గుర్తించబడ్డాయి. అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుండి పొందిన ఈ గుర్తింపు వాటిలో చాలా ప్రత్యేకమైనది.” అన్నారు.

GHIAL అనుసరించే వివిధ ఇంధన సామర్థ్య పద్ధతులు పలు పారిశ్రామిక వేదికలపై ఇప్పటికే గుర్తించబడ్డాయి. గత మూడేళ్లుగా, GHIAL చేపట్టే ఇంధన సామర్థ్య చర్యల వల్ల ఇంధనం గణనీయంగా ఆదా అయింది. ఇది విమానాశ్రయంలో కర్బన ఉద్గారాలను తగ్గించడానికి దారి తీసింది. GMR హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం ఒక కార్బన్ న్యూట్రల్ విమానాశ్రయం. ఇది ఎయిర్‌పోర్ట్స్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ వారి ఎయిర్‌పోర్ట్స్ కార్బన్ అక్రిడిటేషన్ కార్యక్రమం కింద నుండి లెవల్ 3 + “న్యూట్రాలిటీ” అక్రిడిటేషన్ కలిగి ఉంది.

GHIAL 2019 మరియు 2020 లలో CII యొక్క ప్రతిష్టాత్మక “నేషనల్ ఎనర్జీ లీడర్ అవార్డు’’ను కూడా గెలుచుకుంది. ఇది CII- GBC ల ప్రతిష్టాత్మక ఎనర్జీ మేనేజ్‌మెంట్ ప్రోగ్రామ్ – నేషనల్ అవార్డ్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ ఎనర్జీ మేనేజ్‌మెంట్‌లో 2017 నుండి క్రమం తప్పకుండా ఎక్సలెంట్ ఎనర్జీ ఎఫీషియెంట్ ట్రోఫీని గెలుచుకుంటోంది. ఇటీవలే  GMR హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం "గ్రౌండ్ మౌంటెడ్ సోలార్" విభాగంలో ప్రతిష్టాత్మక CII - గ్రీన్ పవర్ పెర్ఫార్మెన్స్ ఎక్సలెన్స్ అవార్డ్స్ 2020ను కూడా గెలుచుకుంది.

 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com