తెలంగాణ లో పలు జాతీయ రహదారులను ప్రారంభించిన నితిన్ గడ్కరీ
- December 21, 2020
న్యూ ఢిల్లీ:తెలంగాణాలో కొత్తగా రూ.13,169 కోట్లతో 766 కిలోమీటర్ల మేర రహదారులను అభివృద్ధి చేస్తున్నారు. ఇందులో భాగంగా చేపట్టిన 14 రహదారుల్లో 6 ప్రాజెక్టులను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జాతికి అంకితం చేయడంతోపాటు మరో 8 నూతన రహదారులకు భూమిపూజ చేశారు. ఇందులో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లా నుంచి వరంగల్‌లోని ఆరేపల్లి వరకు నిర్మించిన జాతీయ రహదారి 163ను ప్రారంభించారు.
దీంతోపాటు సూర్యాపేట-నల్లగొండ జిల్లాల్లో నిర్మించిన రోడ్లు, వికారాబాద్-నారాయణ్‌పేట జిల్లాల్లో, హైదరాబాద్ ఔటర్ రింగ్‌రోడ్డు నుంచి మెదక్ రూటును, ఆత్మకూర్-పరసా సెక్షన్లో 34 కి.మీ. మేర నిర్మించిన రోడ్డు, మహదేవ్పూర్-భూపాలపల్లి సెక్షన్లో కొత్తగా నిర్మించిన రోడ్లను జాతికి అంకితం చేశారు.
సూర్యాపేట-ఖమ్మం, మంచిర్యాల-రేపల్లెవాడ, రామ్సన్పల్లె-మంగళూరు, కంది-రామ్సన్‌పల్లెతోపాటు మరికొన్ని రహదారుల పనులకు శంకుస్థాన చేశారు. అనంతరం గడ్కరీ మాట్లాడుతూ రాష్ట్రంలో ఆయిల్ పామ్ సాగును సీఎం కేసీఆర్ ప్రోత్సహించడంపై సంతోషంగా ఉందన్నారు.
వ్యవసాయ ఉత్పత్తుల నుంచి ఇంధనం తయారీ పెంచడంపై దృష్టిసారించాలని అన్నారు. దేశంలో పెట్రోలియం కోసం రూ.8 లక్షల కోట్లు ఖర్చుచేస్తున్నామని చెప్పారు.
రాష్ట్రంలో పలు రోడ్లను గ్రీన్ కారిడార్‌గా నిర్మిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి వీకే సింగ్, రాష్ట్ర మంత్రి ప్రశాంత్ రెడ్డి, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష