లైసెన్స్ లేని ఆన్లైన్ జ్యుయెలరీ అమ్మకాలపై కఠిన చర్యలు
- December 21, 2020
మనామా:మినిస్ట్రీ ఆఫ్ ఇండస్ట్రీ కామర్స్ అండ్ టూరిజం, సోషల్ మీడియా వేదికగా లైసెన్స్ లేకుండా జ్యుయెలరీ విక్రయిస్తున్నవారి పట్ల అప్రమత్తంగా వుండాలని పౌరుల్ని, నివాసితుల్ని హెచ్చరించింది. ఈ తరహా అమ్మకాల వల్ల మోసాలు ఎక్కువగా జరిగే అవకాశం వుందని మినిస్ట్రీ చెబుతోంది. ఆన్లైన్ ద్వారా నడిచే ఇలాంటి అమ్మకాలపై నిఘా వుంచుతున్నామనీ, లైసెన్స్ లేకుండా విక్రయాలు జరుపుతున్నవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మినిస్ట్రీ హెచ్చరించింది. ఇలాంటి మార్గాల ద్వారా నడిచే ఆర్థిక వ్యవహారాలు, టెర్రిస్ట్ ఫైనాన్సింగ్ కోసం మళ్ళే అవకాశం వుందని అంటోంది మినిస్ట్రీ. కమర్షియల్ రిజిస్టర్ చట్టం 27/2015 ప్రకారం ఈ తరహా విక్రయాలు నేరపూరితమైనవని అధికారులు పేర్కొన్నారు. ఇలాంటి మోసపూరిత అమ్మకాల్ని ఆన్లైన్లో గుర్తిస్తే వెంటనే వెబ్సైట్లో ఫిర్యాదు చేయాలని అధికారులు సూచిస్తున్నారు.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు