కొత్త రకం వైరస్‌పై జాగ్రత్త అవసరం:WHO

- December 21, 2020 , by Maagulf
కొత్త రకం వైరస్‌పై జాగ్రత్త అవసరం:WHO

జెనీవా:బ్రిటన్‌లో బయటపడిన కొత్త రకం వైరస్‌పై పూర్తి సమాచారం తెలిసేవరకు ప్రజలందరూ జాగ్రత్తగా వుండాల్సిన అవసరం వుందని WHO కోరింది.బ్రిటన్‌ అధికారులతో ఎప్పటికప్పుడు చర్చలు జరుపుతున్నామని, అక్కడ వారు చేస్తున్న పరిశోధనల సమగ్ర సమచారాన్ని అందిస్తున్నారని, అది తమకు అందిన వెంటనే ప్రకటిస్తామని WHO తెలిపింది.ఈ నేపథ్యంలో ప్రజలందరూ అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ అప్రమత్తంగా వుండాల్సిన అవసరం వుందని హెచ్చరించింది.

కొత్త వైరస్‌ విజృంభిస్తోంది...

కొత్త రకం వైరస్‌కు సంబంధించి కేసులు అడ్డూ అదుపు లేకుండా పెరుగుతున్నాయని బ్రిటన్‌ పేర్కొంది. రాబోయే క్రిస్మస్‌, నూతన సంవత్సర వేడుకులను దృష్టిలో వుంచుకుని ఆదివారం నుండి బ్రటన్‌లో కఠినమైన ఆంక్షలు తీసుకువచ్చినట్లు బ్రిటన్‌ ఆరోగ్య మంత్రి హాన్‌కాక్‌ తెలిపారు.

లండన్‌ దాటి ఎవరూ బయటకు ప్రయాణాలు చేయకుండా నిలువరించేందుకు అదనుపు పోలీసు బలగాలను రైల్వే స్టేషన్లలో ఇతర ప్రాంతాల్లో మోహరించారు.వ్యాక్సిన్‌ పూర్తిగా అందరికీ అందుబాటులోకి వచ్చేవరకు ఈ పరిస్థితులను తట్టుకోవడం చాలా క్లిష్టమైన పనని అన్నారు. శనివారం ఉదయానికి మూడున్నర లక్షల మందికి వ్యాక్సిన్‌ వేశారు.ఈ వారంతానికి ఈ సంఖ్య ఐదు లక్షలకు చేరే అవకాశం వుంది.శలవు దినాలను పురస్కరించుకుని తొలుత ఆంక్షలు సడలించాలని భావించినా కరోనా వైరస్‌ తన తీరును మార్చుకుని కొత్త రూపును సంతరించుకుని మరింత ఆందోళనకరంగా తయారవడంతో బ్రిటన్‌ ప్రధాని మనస్సు మార్చుకున్నారు. వెంటనే కఠిన ఆంక్షలు అమలు చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com