రజినీ ఒప్పుకుంటే నేను ముఖ్యమంత్రి గా రెడీ: కమల్ హాసన్
- December 22, 2020
చెన్నై : రజనీకాంత్ కోరితే ముఖ్యమంత్రి అభ్యర్థిగా పోటీ చేసేందుకు తాను సిద్ధమేనని 'మక్కల్ నీది మయ్యం' అధ్యక్షుడు, నటుడు కమల్ హాసన్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంచీపురం జిల్లాలో ఆయన పర్యటించారు. రజనీకాంత్ పార్టీని స్థాపించినా తాను సిఎం పదవికి పోటీ చేయనని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రచారంలో 'రజనీకాంత్ మిమ్మల్ని సిఎం అభ్యర్థిగా ప్రకటిస్తే సిద్ధమేనా?' అన్న ప్రశ్నకు కమల్‌హాసన్ స్పందిస్తూ.. 'రజనీకాంత్ తనను సిఎం అభ్యర్థిగా ప్రకటిస్తే అంగీకరిస్తానని' బదులిచ్చారు. డబ్బులు పంచేందుకు ఆసక్తి చూపే ప్రభుత్వం.. ప్రజా సమస్యల పరిష్కారంలో ఎందుకు ఆసక్తి చూపడం లేదని విమర్శించారు. ప్రచారంలో భాగంగా చినకాంచీపురంలోని చేనేత కార్మికులను ఆయన కలుసుకున్నారు. తాను అధికారంలోకి వస్తే చేనేత కార్మికుల సంక్షేమానికి ప్రత్యేక పథకాలు ప్రవేశపెడతానని హామీ ఇచ్చారు.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు