కోవిడ్ 19: అబుధాబి కొత్త ట్రావెల్ రూల్స్
- December 23, 2020
అబుధాబి: అబుధాబి క్రైసిస్, ఎమర్జన్సీస్ మరియు డిజాస్టర్ కమిటీ, తాజాగా ప్రివెంటివ్ మరియు ప్రికాషనరీ మెజర్స్కి సంబంధించి మరిన్ని కొత్త అంశాల్ని వెల్లడించడం జరిగింది. ఆర్థిక, పర్యాటక అలాగే వినోద కార్యక్రమాలకు సంబంధించి ఆపరేషనల్ కెపాసిటీని పెంచేలా కమిటీ కొన్ని నిర్ణయాలు తీసుకుంది. పిసిఆర్ లేదా డిపిఐ టెస్ట్ రిజల్ట్‌కి సంబంధించి 48 గంటల వ్యవధిని 72 గంటలకు పెంచారు. ప్రస్తుతం 4 అలాగే 8వ రోజు ప్రయాణీకులకు టెస్ట్ చేస్తుండగా, ఇకపై 6వ రోజున టెస్ట్ చేస్తారు. క్వారంటైన్ నిబంధనలు విషయానికొస్తే, గ్రీన్ లిస్ట్ దేశాల నుంచి వచ్చే ప్రయాణీకులకు క్వారంటైన్‌ని 10 రోజులకు కుదించారు. ఆరు రోజుల కంటే ఎక్కువగా వుంటే, ఆరవ రోజున పిసిఆర్ టెస్ట్ చేయించుకోవాల్సి వుంటుంది. ఒకవేళ 12 రోజుల వరకు వుంటే, 12వ రోజు కూడా టెస్ట్ చేయించుకోవాలి. 10 రోజుల క్వారంటైన్ అలాగే 8వ రోజున కరోనా టెస్ట్ చేయించుకోవడాన్ని అంతర్జాతీయ ప్రికాషనరీ మెజర్‌గా పేర్కొంటున్నారు. నేషనల్ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్‌లో పాల్గొనేవారికి కొన్ని మినహాయింపులిస్తున్నారు. సెహ(SEHA) టెస్టింగ్ సెంటర్స్ సామర్థ్యాన్ని పెంచేందుకు నిర్ణయం తీసుకోవడం జరిగింది.
గ్రీన్ లిస్ట్ దేశాలు:ఆస్ట్రేలియా,బ్రూనై,చైనా,గ్రీస్,గ్రీన్లాండ్,హాంగ్ కాంగ్,మలేషియా,మారిషస్,న్యూ జీలాండ్,సౌదీ అరేబియా,సింగపూర్,టైవాన్,టజీకిస్తాన్,థాయిలాండ్,ఉజ్బెకిస్తాన్,వియత్నాం
--సుమన్(మాగల్ఫ్ ప్రతినిధి,అబుధాబి)
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష