తెలంగాణ లో 635 కరోనా కేసులు..నలుగురు మృతి
- December 23, 2020
హైదరాబాద్:తెలంగాణలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన24 గంటల్లో కొత్తగా 635 పాజిటివ్ కేసులు నమోదు కాగా, నలుగురు మృతి చెందారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 2,82,982 పాజిటివ్ కేసులు నమోదు కాగా,మొత్తం 1,522 మంది మృతి చెందారు. తాజాగా కరోనా నుంచి 573 మంది కోలుకోగా, ఇప్పటి వరకు 2,74,833 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో మరణాల రేటు 0.53 శాతం ఉండగా, దేశంలో 1.5 శాతం ఉంది.
రికవరీ రేటు రాష్ట్రంలో 97.12 శాతం ఉండగా, దేశంలో 95.7 శాతం ఉన్నట్లు వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. మొత్తం యాక్టివ్ కేసులు 6,627 ఉండగా, హోం ఐసోలేషన్ లో 4,467 మంది చికిత్స పొందుతున్నారు. తాజాగా జీహెచ్ ఎంసీలో 115 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
--హరి(మాగల్ఫ్ ప్రతినిధి,తెలంగాణ)
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







