ఏపీ ప్రభుత్వం రైతులకు శుభవార్త
- December 23, 2020
అమరావతి:ఏపీ ప్రభుత్వం రైతులకు శుభవార్త చెప్పింది. రైతులకు ఈనెల 29 వ తేదీన రైతు భరోసా పథకం కింద ప్రభుత్వం అందించే రూ.2వేల రూపాయల సహాయంతో పాటుగా ఇన్ ఫుట్ సబ్సిడీ మొత్తం కూడా రైతుల ఖాతాల్లో వేయబోతున్నారు.ఏపీ వ్యవసాయశాఖ ద్వారా రాష్ట్రంలోని 50.47 లక్షల మంది రైతుల అకౌంట్లలోకి డబ్బులు జమ కాబోతున్నాయి. మొదట ఇన్ ఫుట్ సబ్సిడీ అమౌంట్ ఈనెల 27 వ తేదీన జమ చేస్తామని వ్యవసాయశాఖ మంత్రి ప్రకటించారు. అయితే, రెండు రోజుల వ్యవధిలో రైతు భరోసా పథకం కింద డబ్బులు అందజేయాలి కాబట్టి రెండు విడివిడిగా కాకుండా ఒకేరోజున రైతుల అకౌంట్ లో జమ కాబోతున్నాయి. న్యూ ఇయర్ కు రెండు రోజుల ముందుగానే రైతుల అకౌంట్ లోకి డబ్బులు జమ కాబోతుండటం మంచి విషయంగా చెప్పుకోవాలి.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్‌గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్‌పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







