వ్యాక్సినేషన్ పై పుకార్లని ఖండించిన ఆరోగ్య శాఖ

- December 24, 2020 , by Maagulf
వ్యాక్సినేషన్ పై పుకార్లని ఖండించిన ఆరోగ్య శాఖ

బహ్రెయిన్: ఓ పౌరుడు వ్యాక్సినేషన్‌ కారణంగా చనిపోయాడంటూ వస్తున్న పుకార్లను ఆరోగ్య శాఖ కొట్టి పారేసింది. ఈ మేరకు సోషల్‌ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని హెల్త్‌ మినిస్ట్రీ స్పష్టం చేసింది. ఈ తరహా దుష్ప్రచారం చేసేవారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని సంబంధిత అథారిటీస్‌ హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. పౌరులు అలాగే నివాసితుల హెల్త్‌ కేర్‌ విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదనీ, ప్రజల ప్రాణాల్ని అత్యంత విలువైనవిగా భావిస్తామని ఈ మేరకు మినిస్ట్రీ తేల్చి చెప్పింది. సంబంధిత రెగ్యులేటరీ అథారిటీస్‌ అన్ని విషయాల్నీ సమగ్రంగా పరిశీలించిన తర్వాతే హెల్త్‌ ప్రొసిడ్యూర్స్‌ విషయంలో న్ణియాలు తీసుకోవడం జరుగుతుందని, అత్యంత క్షేమకరమైనవాటికే బహ్రెయిన్‌లో అనుమతి వుంటుందని మినిస్ట్రీ స్పష్టం చేసింది.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com