కొత్త సంవత్సరం హంగామా..థియేటర్స్‌లో విడుదలవుతున్న నాని ‘వి’
- December 24, 2020
నేచురల్ స్టార్ నాని, సుధీర్‌బాబు హీరోలుగా ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో దిల్‌రాజు, శిరీశ్, హర్షిత్ రెడ్డి నిర్మించిన యాక్షన్ ఎంటర్టైనర్ ‘వి’. నివేదా థామస్, అదితిరావు హైదరి హీరోయిన్స్. నాని నటించిన 25వ చిత్రమిది. కోవిడ్ పరిస్థితుల కారణంగా సినిమా థియేటర్స్ మూతపడటంతో సినిమాను అమెజాన్ ప్రైమ్‌లో విడుదల చేశారు. భారతదేశం సహా 200 దేశాలు, టెర్రిటోరియాస్ లో ఉన్న ప్రైమ్ ప్రేక్షకులు సెప్టెంబర్ 5 న విడుదలైన ‘వి’ చిత్రాన్ని ఎంజాయ్ చేశారు. సూపర్‌డూపర్ టాక్‌తో తెలుగు ప్రేక్షకులను డిజిటల్ మాధ్యమంలో ఆకట్టుకుంది ‘వి’ చిత్రం. ఇప్పుడు కొత్త సంత్సరం 2021 ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా జనవరి 1న ‘వి’ చిత్రాన్ని థియేటర్స్‌లో విడుదల చేస్తున్నారు నిర్మాతలు. ఈ సందర్భంగా... హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు మాట్లాడుతూ - ‘‘నాని, సుధీర్‌బాబు, నివేదా థామస్, అదితిరావు హైదరి కాంబినేషన్లో మా వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్లో చేసిన ‘వి’ సినిమాను కోవిడ్ పరిస్థితుల నేపథ్యంలో అమెజాన్‌లో విడుదల చేసిన సంగతి తెలిసిందే. సినిమాకు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రేక్షకులు ఎంత ఆసక్తిగా సినిమా కోసం ఎదురుచూశారో.. అదే విధంగా ఆదరించారు. నాని 25వ సినిమా ఇది. ఎంతో ప్రెస్టీజియస్‌గా, రిచ్‌గా తెరకెక్కించాం. కానీ థియేటర్స్‌లో సినిమాను విడుదల చేయలేకపోయామనే ఆలోచన ఉండిపోయింది. ఇప్పుడు థియేటర్స్ ఓపెన్ అవుతున్నాయి. ఎంతో సంతోషించాల్సిన విషయం. ఈ నేపథ్యంలో రాబోయే కొత్త సంవత్సరం అందరికీ మంచి జరగాలని, అందరూ బావుండాలని కోరుకుంటూ జనవరి 1న వి సినిమాను థియేటర్స్‌లో విడుదల చేస్తున్నాం. ఈ యాక్షన్ థ్రిల్లర్‌ను బిగ్ స్క్రీన్‌పై చూస్తే ఉండే ఫీల్ వేరుగా ఉంటుంది’’ అన్నారు.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు