టిక్కెట్‌ రిఫండ్‌కి అనుమతిచ్చిన ఎతిహాద్‌

- December 24, 2020 , by Maagulf
టిక్కెట్‌ రిఫండ్‌కి అనుమతిచ్చిన ఎతిహాద్‌

అబుధాబి: ఎతిహాద్‌ ఎయిర్‌వేస్‌, అక్టోబర్‌ 1 ఆ తర్వాత ప్రయాణాలకుగాను బుక్‌ చేసుకున్న టిక్కెట్లకు రిఫండ్‌ ఇచ్చేందుకు అనుమతిస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే, ఇందుకోసం కొన్ని నిబంధనల్ని పెట్టింది సంస్థ. ట్రావెల్‌ బ్యాన్స్‌, ప్రభుత్వ రిస్ట్రిక్షన్స్‌ వంటి కారణాలతో రద్దయిన విమానాలకు సంబంధించి, పిసిఆర్‌ టెస్ట్‌ రిజల్ట్‌ కారణంగా రద్దయిన ప్రయాణాలకు సంబంధించి మాత్రమే రిఫండ్‌ చేస్తారు. కాగా, ప్రస్తుతం నడుస్తున్న బుకింగ్స్‌కి సంబంధించి ఫ్లెక్సిబుల్‌ ఆప్షన్స్‌ కల్పిస్తున్నట్లు ఎతిహాద్‌ పేర్కొంది. కోవిడ్‌ 19 ఛాలెంజెస్‌ నేపథ్యంలో సరికొత్త రీతిలో ఎతిహాద్‌ విమాన ప్రయాణాలకు సంబంధించి చర్యలు తీసుకుంటోంది. ఈ వింటర్‌ కోసం 60 నగరాలకు ఎతిహాద్‌ విమానాల్ని నడుపుతోంది. అయితే, ప్రస్తుతం నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో 2020-21 వింటర్‌ సెషన్‌కి సంబంధించి కొన్ని విమాన సర్వీసుల్ని రద్దు చేయడం జరిగింది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com