అమరావతి బిల్లు ఆమోదం..ప్రధాని మోదీని కలిసిన నారా లోకేశ్
- April 02, 2026
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ పార్లమెంటులో బిల్లు ఆమోదం పొందడంపై హర్షం వ్యక్తమవుతోంది. ఈ చారిత్రాత్మక విజయం తర్వాత రాష్ట్ర మంత్రి నారా లోకేశ్, కూటమి ఎంపీల బృందంతో కలిసి న్యూఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసి కృతజ్ఞతలు తెలిపారు.లోక్‌సభలో అమరావతి బిల్లు ఆమోదం పొందిన నేపథ్యంలో, మంత్రి నారా లోకేశ్, ఏపీ కూటమి ఎంపీలు ప్రధాని నరేంద్ర మోదీని మర్యాదపూర్వకంగా కలిశారు.
లోకేశ్ ప్రధానికి శాలువా కప్పి సాదరంగా సన్మానించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ లోకేశ్‌ను అభినందించారు.అనంతరం లోకేశ్ బృందం లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను కూడా కలిసి, బిల్లు ఆమోద ప్రక్రియలో ఆయన అందించిన సహకారానికి ధన్యవాదాలు తెలిపారు.
ప్రధానితో భేటీ తర్వాత లోకేశ్ సోషల్ మీడియా వేదికగా తన భావాలను పంచుకున్నారు. “అమరావతి బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందినందుకు ఆంధ్రప్రదేశ్ లోని కోట్లాది మంది ప్రజల తరపున ప్రధానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపాను.”భూములను త్యాగం చేసి, ఏళ్ల తరబడి అనిశ్చితిని ఎదుర్కొని అమరావతి కలను సజీవంగా ఉంచిన మన రైతుల అసాధారణ కథను ప్రధానికి వివరించినట్లు లోకేశ్ పేర్కొన్నారు.రైతుల త్యాగానికి గౌరవంగా అమరావతిని నిజమైన ప్రపంచ స్థాయి రాజధానిగా నిర్మించడంలో ప్రధాని మార్గదర్శకత్వం కోరినట్లు ఆయన తెలిపారు.
తాజా వార్తలు
- పసిడి పతకాలతో మెరిసిన భారత చెస్ స్టార్లు మయాంక్, ప్రతీతి!
- కువైట్‌లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్‌లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!
- ఫ్రీ ఫుడ్ కంటే హెల్త్ ఇన్సూరెన్స్, ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్కే ప్రాధాన్యం..!!
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!







