తెలంగాణ:యూకే నుంచి రాష్ట్రానికి 1200 మంది
- December 24, 2020
హైదరాబాద్:కొత్త రకం కరోనా వైరస్ ఇప్పుడు అన్ని దేశాలను, రాష్ట్రాలను కలవరపెడుతోంది... ఆదిలోనే చెక్ పెట్టే విధంగా అప్రమత్తమైన రాష్ట్రాలు విదేశాల నుంచి వచ్చినవారిని గుర్తించి కోవిడ్ పరీక్షలు నిర్వహిస్తున్నాయి... ఇక, కొత్త రకం కరోనా వైరస్‌తో ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు నెలకొన్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో తీసుకుంటున్నచర్యలపై సమీక్ష సమావేశం నిర్వహించారు.. డిసెంబర్ 9 నుండి ఇప్పటి వరకు యూకే నుండి, యూకే మీదుగా తెలంగాణకు 1200 మంది వచ్చారని తెలిపారు.. అయితే, వీరిలో ఇప్పటికే 846 మందిని గుర్తించినట్టు వెల్లడించారు.. అందరికీ కోవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. ఏడుగురికి పాజిటివ్‌గా తేలిందన్న మంత్రి.. కానీ, అది కోవిడా? లేక కొత్త రకం వైరసా? అని నిర్ధారించుకోవడానికి వారికి శాంపిల్స్ హైదరాబాద్‌లోని సీసీఎంబీ ల్యాక్‌కు వైద్యశాఖ అధికారులు పంపించారని తెలిపారు. మరోవైపు.. పాజిటివ్ వచ్చిన వారు.. కలిసిన వారందరినీ కూడా ట్రేసింగ్ చేస్తున్నామని.. నెగెటివ్ వచ్చిన వారిని సైతం మానిటరింగ్ చేస్తున్నామని వెల్లడించారు. యూకే నుంచి వచ్చిన వాళ్లలో హైదరాబాద్, వరంగల్, సిద్దిపేట, మేడ్చల్, జగిత్యాలలలో పాజిటివ్ కేసులు నమొదు అయ్యాయి.. ఇప్పటి వరకు ఏడుగురికి పాజిటివ్‌గా తేలగా.. జిన్ మ్యాపింగ్ రిపోర్ట్ రావటానికి మూడు నాలుగు రోజులు పట్టే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
--హరి(మాగల్ఫ్ ప్రతినిధి,తెలంగాణ)
తాజా వార్తలు
- NATS ఆధ్వర్యంలో కాఫీ విత్ కాప్స్ ప్రజా భద్రత పై అవగాహన సదస్సు
- కువైట్ నుంచి విజయవాడకు జజీరా ఎయిర్వేస్ కొత్త విమాన సర్వీసులు
- రియాద్‌లో సాటా ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది–ఈద్ మిలాప్ వేడుకలు
- తిరుపతిలో ఘనంగా P4 తొలి వార్షికోత్సవం..
- భారీ లేఆఫ్స్ లేవు..తాత్కాలిక సర్దుబాట్లకే కంపెనీల మొగ్గు!
- ఏప్రిల్ 6 నుండి ఆన్లైన్ క్లాసులు ప్రారంభించనున్న భారతీయ పాఠశాలలు!
- సముద్రగర్భ కేబుళ్లకు యుద్ధ ముప్పు..ప్రమాదంలో భారత ఇంటర్నెట్..!!
- కువైట్ విమానాశ్రయంలో భారీ అగ్నిప్రమాదం..!!
- 'Maarif' ద్వారా ఆన్లైన్ నమోదును ప్రారంభించిన MoEHE..!!
- కేబుల్స్ చోరీ కేసులో ముగ్గురు ప్రవాసులు అరెస్ట్..!!









