గల్ఫ్ లోని ఉపాది కష్టాలకు తెలంగాణా ప్రభుత్వం అభయ హస్తం
- February 21, 2016
కొద్ది నెలలుగా పతనమవుతున్న చమురు ధరల కారణంగా గల్ఫ్‌లో గడ్డు పరిస్థితులు ఏర్పడ్డాయని, అనేక ప్రాజెక్టులు మధ్యంతరంగా ఆగిపోవడం, నూతనంగా ప్రతిపాదించిన ప్రాజెక్టులను వాయిదా వేయడంతో భారతీయులకు గల్ఫ్ దేశాలలో ఉపాధి అవకాశాలు తగ్గాయని యూఏఈలోని భారత రాయబారి టి.పి. సీతరాం తెలిపారు.
దుబాయిలోని భారతీయ కాన్సులేటులో శనివారం మధ్యాహ్నం భారతీయ నైపుణ్యత అభివృద్ధి (స్కిల్ డెవలప్ మెంట్) సదస్సు జరిగింది. ఈ సదస్సులో తెలంగాణ, ఉత్తరప్రదేశ్ మంత్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొద్ది నెలలుగా నెలకొన్న పరిస్థితులు (ఇరాన్,సిరియా ఘటనలు), ఒక్కసారిగా చమురు ధరలు పడిపోవడంతో అనేక సంస్థలు వేతనాలను చెల్లించలేని దుస్థితిలో ఉన్నాయని చెప్పారు. వేతనాల చెల్లింపులో జాప్యంపై ప్రతి రోజు అనేక మంది భారతీయులు ఫిర్యాదులు చేస్తుండడంతో ఈ విషయం తమకు తెలిసిందని రాయబారి సీతారం అన్నారు.
ప్రవాస భారతీయుల సంక్షేమంలో భాగంగా భారతీయ దౌత్యవేత్తలు ప్రవాసీ కార్మికులు నివాసముంటున్న ప్రదేశాలను సందర్శిస్తామని తాము ప్రతిపాదించగా యూఏఈతో పాటు గల్ఫ్ దేశాలన్నీ తీవ్రంగా వ్యతిరేకించాయని ఆయన వెల్లడించారు. భారత అధికారులుగా తాము భారతీయుల సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తామని ఆ మేరకు అనేక ప్రతిపాదనలు రూపొందించి గల్ఫ్ దేశాలకు పంపిస్తే ఆయా దేశాలు వాటికి ఆమోదం తెలుపడం లేదని ఆయన అన్నారు.
భారతదేశం నుంచి ఉద్యోగాలకై వస్తున్న అనేక మందికి కేవలం చదువు తప్ప వేరే అనుభవం లేదని, నూతన యంత్రాలపై పనిచేయడం ప్రధాన సమస్యగా ఉందని ఆయన అన్నారు. ఈ నేపథ్యంలో శిక్షణ నైపుణ్యాన్ని అభివృద్ధి చేయవల్సిన అవసరం ఉందని, ఈ దిశగా రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని సీతరాం సూచించారు.
వివిధ కార్పోరేట్ సంస్ధల ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు, అనుమానాలకు తెలంగాణ ప్రభుత్వ ఉన్నతాధికారులు హరిప్రీత్ సింగ్, రాజీవ్ త్రివేది, పార్లమెంటు సభ్యురాలు కల్వకుంట్ల కవిత సమాధానలిచ్చారు. కార్యక్రమంలో తెలంగాణ హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి, ఉత్తరప్రదేశ్ మంత్రి అభిషేక్ మిశ్రా ఆ రాష్ట్ర ఉన్నతాధికారులు, దుబాయిలోని కాన్సల్ జనరల్ అనురాగ్ భూషణ్ తదితర అధికారులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమమలో మన తెలంగాణా అసోసియేషన్స్ తరుపున జువ్వాడి శ్రీనివాస రావు(GWTCA,అధ్యక్షులు),రాజ శ్రీనివాస రావు ఐత,పృథ్విరాజ్,కిరణ్ కుమార్ పీచర(ETCA,,అధ్యక్షులు), సత్యనారాయణ గాంధారి,అరుణ్ కుమార్ మహేంద్ర,రాజు సట్ల తదితరులు పాల్గొన్నారు.



తాజా వార్తలు
- మెటా సేవలకు అంతరాయం..ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ డౌన్!
- ఇరాన్ రాయబారిని పిలిపించిన జోర్డాన్.. క్షిపణి దాడులు వెంటనే నిలిపివేయాలని డిమాండ్
- రాజమండ్రిలో తొలి కరోనా కేసు నమోదు
- అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన పార్లమెంటరీ పార్టీ నేత బాలశౌరి
- అకాబా విమానాశ్రయం, పోర్టుకు ఎలాంటి ముప్పు లేదు: జోర్డాన్ ప్రభుత్వం
- సరికొత్త చరిత్ర సృష్టించిన పీవీ సింధు
- తిరుమలలో రూమ్ ఎలా పొందాలో తెలుసా?
- ఇరాన్ రెండో దాడితో కువైట్ విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం.. అత్యవసర ప్రణాళికలు అమలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!







