మానవాళికి మార్గదర్శకం భగవద్గీత: ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
- December 25, 2020
హైదరాబాద్:నిత్యం 'గీతా' పఠనం చేయడం ద్వారా జీవితంలో సన్మార్గంలో పయనిస్తామన్నారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. చిక్కడ్ పల్లిలోని శ్రీ త్యాగరాయ గానసభలో జరిగిన 'గీతాజయంతి మహోత్సవం'లో ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు. ముందుగా గో మాతను పూజించిన ఎమ్మెల్సీ కవిత, భారతీయ సంస్కృతిలో గో పూజకు ఎంతో విశిష్టత ఉందన్నారు.
భగవద్గీత లోని ఎన్నో సూక్ష్మమైన, ఆధ్యాత్మికమైన అంశాలను వివరించేందుకు ఈ కార్యక్రమం నిర్వహించుకోవడం అదృష్టంగా భావిస్తున్నానని ఎమ్మెల్సీ కవిత తెలిపారు. ప్రపంచంలో ఎన్ని గ్రంథాలున్నా 'గీత'కు మాత్రమే జయంతి నిర్వహిస్తారని ఎమ్మెల్సీ కవిత గుర్తు చేశారు. శ్రీ కృష్ణుడు స్వయంగా ఇచ్చిన గీతా సందేశం తర తరాలకు మంచి మార్గాలను బోధిస్తుందన్నారు. 'గీత' ను అర్థం చేసుకుంటే శోకాలను దూరం చేసుకుని జీవితంలో ఉన్నత స్థానానికి చేరుకోవచ్చని తెలిపారు ఎమ్మెల్సీ కవిత. జీవితంలో మనం చేసిన ప్రతి పనికి ఫలితం ఉంటుందని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. అమెరికా లో ప్రతి ఏడు లక్షల మందికి ఒక పోలీసు ఉంటే, ఇండియాలో ప్రతి 20 లక్షల మందికి ఒక పోలీసు ఉన్నారన్న ఎమ్మెల్సీ కవిత, అయినప్పటికీ ఇండియాలో తక్కువ నేరాలు జరుగుతుండటానికి దేశ సనాతన ధర్మాలు నేర్పించిన జీవన విధానమే కారణమన్నారు. గంగా, గీత, గాయత్రి, గోవింద... ఇలాంటి నాలుగు గొప్ప అంశాలున్న భారతదేశంలో జన్మించడం అదృష్టంగా భావిస్తున్నాన్నట్టు ఎమ్మెల్సీ కవిత తెలిపారు. ప్రతి ఒక్కరు నిత్యం 'గీత' పఠనం చేయాలన్న ఎమ్మెల్సీ కవిత.. గీతామృతంలోని సందేశాన్ని అర్థం చేసుకున్న వ్యక్తి, సమాజానికి ఎంతో ఉపయోగపడతారన్నారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఠా గోపాల్, మహా సహస్ర అవధాని డా.గరికపాటి నరసింహారావు, టీఆర్ఎస్ నేత దేవీ ప్రసాద్, రాష్ట్ర గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ శ్రీధర్, త్యాగరాయ గానసభ అధ్యక్షుడు కళా వి.ఎస్ జనార్థన్ మూర్తి, సామాజికవేత్తలు డా.విజయ్ కుమార్, డా.రేగొండ సురేష్ పాల్గొన్నారు.

తాజా వార్తలు
- AP కి కొత్త రాజధానిగా మావిగాన్ ని ప్రతిపాదించిన YS జగన్..
- మేడ్ ఇన్ అమరావతి క్వాంటం హార్డ్ వేర్ లక్ష్యం
- WhatsApp new feature:మెసేజ్లు ఓపెన్ చేయకుండానే సారాంశం చూసేయండి!
- ట్యాంక్ బండ్ శివకు సీఎం భారీ సాయం
- స్కాలర్ షిప్ దరఖాస్తు గడువు 20 వరకు పొడిగింపు
- AN-26 విమానం కుప్పకూలి 29 మంది దుర్మరణం
- కువైట్ లో ఉగ్రవాద విచారణలు వేగవంతం..!!
- యూఏఈలో పెట్రోల్ బంకుల వద్ద భారీగా క్యూ లైన్లు..!!
- కువైట్కు కొత్త బస్సు మార్గాలను ప్రకటించిన సౌదీ..!!
- మస్కట్లో డిస్టన్స్ లెర్నింగ్ ప్రారంభం..!!









