ఇంటి వద్ద కాఫీ బిజినెస్‌: ఒకరి అరెస్ట్‌

- December 25, 2020 , by Maagulf
ఇంటి వద్ద కాఫీ బిజినెస్‌: ఒకరి అరెస్ట్‌

మనామా:బహ్రెయిన్‌ న్యాయస్థానం, ఓ వ్యక్తి తన ఇంటి వద్ద కేఫ్‌ని నడుపుతూ, కరోనా నిబంధనల్ని పాటించని కారణంగా ఆ వ్యక్తికి ఆరు నెలల జైలు శిక్ష విధించింది. నిందితుడికి 3,000 బహ్రెయినీ దినార్స్‌ జరీమానా కూడా విధించడం జరిగింది. నిందితుడ్ని గత నెలలో అరెస్ట్‌ చేశారు. అక్రమంగా షిషా అలాగే డ్రింక్స్‌ని నిందితుడు సెర్వ్‌ చేస్తున్నట్లు అభియోగాలు మోపబడ్డాయి. ఈ క్రమంలో 13 మంది వినియోగదారుల్ని, ఓ విదేశీ అటెండెంట్‌నీ కూడా అరెస్ట్‌ చేయడం జరిగింది. అటెండెంట్‌కి 1,000 బహ్రెయినీ దినార్స్‌ జరీమానా విధించిన న్యాయస్థానం అతన్ని డిపోర్ట్‌ చేయాల్సిందిగా ఆదేశించింది. వినియోగదారులకు కూడా ఒక్కొక్కరికీ 1,000 బహ్రెయినీ దినార్స్‌ జరీమానా విధించారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com