రైతుల ఖాతాల్లోకి 18 వేల కోట్లు విడుదల చేసిన ప్రధాని మోదీ
- December 25, 2020
న్యూ ఢిల్లీ:కిసాన్ సమ్మాన్ నిధి కింద రైతుల ఖాతాల్లోకి 18 వేల కోట్లు విడుదల అయ్యాయి. ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ జరిగిన ఓ కార్యక్రమంలో ఆ మొత్తాన్ని విడుదల చేశారు. సుమారు 9 కోట్ల మంది రైతులకు ఈ నిధి అందనున్నది. తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న రైతు బంధు తరహాలోనే కేంద్ర ప్రభుత్వం కిసాన్ సమ్మాన్ నిధి ఇస్తున్న విషయం తెలిసిందే. కిసాన్ నిధి స్కీమ్ కింద రైతుల బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా ఎకరానికి రెండు వేల రూపాయాలు జమ అవుతాయి. కిసాన్ క్రెడిట్ కార్డును కూడా రైతులు వాడుకోవాలని ప్రధాని మోదీ ఈ సందర్భంగా తెలియజేశారు. 18 వేల కోట్ల అమౌంట్‌ను రిలీజ్ చేసిన తర్వాత మోదీ.. అరుణాచల్ ప్రదేశ్ రైతులతో మాట్లాడారు. మొత్తం ఆరు రాష్ట్రాల రైతులతో ఆయన వీడియోకాన్పరెన్స్ ద్వారా మాట్లాడారు.
తాజా వార్తలు
- సౌదీలో అక్రమ నివాసితులపై ఉక్కుపాదం.. వారంలో దాదాపు 15 వేల మంది అరెస్ట్..!!
- అక్రమ బరువు తగ్గించే మందులపై యూఏఈ ఉక్కుపాదం..!!
- ఒమన్ రియల్ ఎస్టేట్ రంగంలో కీలక సంస్కరణలు..!!
- కువైట్‌లో కల్తీ చేపలపై ఫుడ్ అథారిటీ కొరడా..!!
- ఖతార్‌లో సముద్ర రవాణా సేవలు పునరుద్ధరణ..!!
- భారత్, బహ్రెయిన్ మధ్య న్యాయ సహకారానికి కొత్త దిశ..!!
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్‌గా చాట్‌జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్‌ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’







