ఆన్‌లైన్ లోన్ యాప్స్ వెనక చైనా లింక్ : సీపీ వీసీ సజ్జనార్
- December 25, 2020
హైదరాబాద్:ఆన్‌లైన్ లోన్ యాప్స్ వెనక చైనా లింక్ ఉందని నిర్దారించారు సీపీ వీసీ సజ్జనార్. ముఠాలో కీలక నిందితుడు చైనాకి చెందిన జియా జాంగ్ అని తేల్చారు. ప్రస్తుతం జియా జాంగ్ సింగపూర్‌లో ఉన్నట్లు గుర్తించారు. జియాతో పాటు కీలకంగా ఉన్న ఉమాపతి పరారీలో ఉన్నారు. గుర్గావ్ కేంద్రంగా ఈ మైక్రో ఫైనాన్స్ దందా చేస్తున్నట్లు గుర్తించారు పోలీసులు. అంతేకాదు మేసేజ్‌ల ద్వారా లింక్స్ పంపించి అప్లికేషన్లను డౌన్ లోడ్ చేసుకునేలా చేసి పిల్లలను కూడా వేధిస్తున్నట్లు తమకు సమాచారం ఉందని సీపీ చెప్పారు. అందుకే, 116 యాప్‌లను డిలీట్ చేయాల్సిందిగా గూగుల్ ప్లేస్టోర్‌కు లెటర్ రాస్తున్నట్లు తెలిపారు. ఆన్‌లైన్ కాల్ మనీ కేసులో విచారణ ఇంకా కొనసాగుతుందని, వేధిస్తే వచ్చి కంప్లైంట్ చేయాలి తప్ప ఆత్మహత్యలు చేసుకోవద్దని విజ్ఞప్తి చేశారు. ఈ కేసులో ఇప్పటి వరకు మొత్తం 9 మందిని అరెస్ట్ చేశారు.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష