ఇజ్రాయెల్, ఐర్లండ్‌ల్లో వెలుగుచూసిన స్ట్రెయిన్
- December 25, 2020
బ్రిటన్‌లో ఇటీవల వెలుగుచూసిన కొత్త కరోనా వైరస్ స్ట్రెయిన్ మెల్ల మెల్లగా ప్రపంచ దేశాలకు విస్తరిస్తుంది. మరోసారి జనం కొత్త వైరస్‌తో భయభ్రాంతులకు గురవుతున్నారు. తాజాగా మరో రెండు దేశాలకు ఈ కొత్త వైరస్ అంటుకుంది. ఇజ్రాయెల్, ఉత్తర ఐర్లండ్‌లలో ఈ రకం వైరస్ కేసులు వెలుగు చేసినట్లు అయా దేశాలు ప్రకటించాయి. ఇజ్రాయెల్‌లో నలుగురు వ్యక్తులకు ఈ కొత్త వైరస్ సోకగా.. వీరిలో ముగ్గురు ఇటీవల ఇంగ్లండ్ నుంచి వచ్చిన వారేనని అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం వీరంతా ఓ హోటల్‌లో స్వీయ నిర్బంధంలో ఉన్నట్లు ఇక్కడి ఆరోగ్యశాఖ వెల్లడించింది. అటు, ఉత్తర ఐర్లండ్‌లోనూ ఓ కేసు నమోదైంది. మరోవైపు, ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు అప్రమత్తమయ్యాయి. బ్రిటన్, దక్షిణాఫ్రికా దేశాలతో రాకపోకలను రద్దు చేసుకుంటున్నాయి. ముందస్తుగా బ్రిటన్ నుంచి వచ్చిన వారి వివరాలను సేకరించి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. కొత్త వైరస్ లక్షణాలు ఉన్నా, లేకున్నా రెండు వారాల పాటు స్వీయ నిర్బంధంలో ఉంచుతున్నారు అధికారులు.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు