డ్రైవింగ్‌లో ఫోన్‌, సీట్‌ బెల్ట్‌ లేకపోవడాన్ని గుర్తించనున్న రాడార్లు

- December 25, 2020 , by Maagulf
డ్రైవింగ్‌లో ఫోన్‌, సీట్‌ బెల్ట్‌ లేకపోవడాన్ని గుర్తించనున్న రాడార్లు

అబుధాబి:జనవరి 1, 2021 నుంచి మొబైల్‌ ఫోన్‌ వాడుతూ డ్రైవింగ్‌ చేయడం, సీట్‌ బెల్ట్‌ ధరించకపోవడం వంటి ఉల్లంఘనల్ని గుర్తించే రాడార్‌ వ్యవస్థ అందుబాటులోకి రానున్నట్లు అబుధాబి పోలీస్‌ వెల్లడించారు. ఈ మేరకు ఓ వీడియోను అథారిటీ సోషల్‌ మీడియా ఛానళ్ళ ద్వారా విడుదల చేయడం జరిగింది. అరబిక్‌, ఇంగ్లీష్‌, మలయాళం మరియు ఉర్దూ భాషల్లో ఈ వీడియోను రూపొందించారు. 'వెహిక్యులర్‌ అటెన్షన్‌ అండ్‌ సేఫ్టీ ట్రాకర్‌' (విఎఎస్‌టి) పేరుతో ఈ రాడార్ల వ్యవస్థను అందుబాటులోకి తెస్తున్నారు. ట్రాఫిక్‌ సేఫ్టీని పెంచడమే ఈ కొత్త వధానం తాలూకు లక్ష్యం. హై రిజల్యూషన్‌ ఫొటోల ద్వారా ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ సాయంతో ఉల్లంఘనల్ని ఆటోమేటెడ్‌ వ్యవస్థ గుర్తిస్తుంది. ఎమిరేట్‌ డ్రైవర్లు, ఎస్‌ఎంఎస్‌ నోటిఫికేషన్‌ ద్వారా వయొలేషన్‌ని గుర్తించగలుగుతారు.

--ప్రదీప్(మాగల్ఫ్ ప్రతినిధి,అబుధాబి)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com