డ్రైవింగ్‌లో ఫోన్, సీట్ బెల్ట్ లేకపోవడాన్ని గుర్తించనున్న రాడార్లు
- December 25, 2020
అబుధాబి:జనవరి 1, 2021 నుంచి మొబైల్ ఫోన్ వాడుతూ డ్రైవింగ్ చేయడం, సీట్ బెల్ట్ ధరించకపోవడం వంటి ఉల్లంఘనల్ని గుర్తించే రాడార్ వ్యవస్థ అందుబాటులోకి రానున్నట్లు అబుధాబి పోలీస్ వెల్లడించారు. ఈ మేరకు ఓ వీడియోను అథారిటీ సోషల్ మీడియా ఛానళ్ళ ద్వారా విడుదల చేయడం జరిగింది. అరబిక్, ఇంగ్లీష్, మలయాళం మరియు ఉర్దూ భాషల్లో ఈ వీడియోను రూపొందించారు. 'వెహిక్యులర్ అటెన్షన్ అండ్ సేఫ్టీ ట్రాకర్' (విఎఎస్టి) పేరుతో ఈ రాడార్ల వ్యవస్థను అందుబాటులోకి తెస్తున్నారు. ట్రాఫిక్ సేఫ్టీని పెంచడమే ఈ కొత్త వధానం తాలూకు లక్ష్యం. హై రిజల్యూషన్ ఫొటోల ద్వారా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో ఉల్లంఘనల్ని ఆటోమేటెడ్ వ్యవస్థ గుర్తిస్తుంది. ఎమిరేట్ డ్రైవర్లు, ఎస్ఎంఎస్ నోటిఫికేషన్ ద్వారా వయొలేషన్ని గుర్తించగలుగుతారు.
--ప్రదీప్(మాగల్ఫ్ ప్రతినిధి,అబుధాబి)
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్‌లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







