తెలంగాణ:కొత్త రకం వైరస్ నేపథ్యంలో టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు
- December 26, 2020
హైదరాబాద్:బ్రిటన్ కేంద్రంగా పురుడుపోసుకున్న కొత్త రకం వైరస్ ప్రపంచాన్ని భయపెట్టిస్తోంది. ఈ క్రమంలో ఈ కొత్త వైరస్‌ను దేశంలోకి రాకుండా అడ్డుకోవడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్రంగా కృషి చేస్తున్నాయి. ఈ క్రమంలోనే తెలంగాణ వైద్యారోగ్య శాఖ అప్రమత్తమైంది. ఇందులో భాగంగా డిసెంబర్ 9 తర్వాత బ్రిటన్ నుంచి రాష్ట్రానికి వచ్చిన వారు వైద్యులకు సహకరించాలని అధికారులు కోరారు.
ఎవరైనా బ్రిటన్ నుంచి రాష్ట్రానికి వస్తే వివరాలను వెంటనే కాల్ సెంటర్ నంబర్ 040-24651119కి ఫోన్‌చేసి చెప్పాలని లేదా 9154170960 నంబర్‌కు వాట్సాప్ చేయాలని అధికారులు విజ్ఞప్తిచేశారు. వైద్య సిబ్బంది నేరుగా ఇంటికి వచ్చి పరీక్షలు నిర్వహిస్తారని తెలిపారు. వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు ట్రేసింగ్, టెస్టింగ్, ట్రీటింగ్ విధానాన్ని అవలంబిస్తున్నామని అధికారులు తెలిపారు. ఇక డిసెంబర్ 9 నుంచి ఇప్పటి వరకు రాష్ట్రానికి సుమారు 1,200 మంది బ్రిటన్ నుంచి రాగా వారిలో 926 మందని గుర్తించి పరీక్షలు నిర్వహించారు. ఇప్పటి వరకు వెల్లడైన ఫలితాల్లో 16 మందికి వైరస్ సోకింది. ప్రస్తుతం వీరిని ప్రత్యేక వార్డుల్లో ఉంచి చికిత్స అందిస్తున్నారు.
--హరి(మాగల్ఫ్ ప్రతినిధి,తెలంగాణ)
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







