రజనీకాంత్ ఆరోగ్యం పై హెల్త్ బులిటెన్ విడుదల చేసిన అపోలో...
- December 26, 2020
హైదరాబాద్:తమిళ సినీ సూపర్‌స్టార్ రజనీకాంత్ అనారోగ్యానికి గురైన విషయం తెలిసిందే. తీవ్ర రక్తపోటుకు గురికావడంతో శుక్రవారం మధ్యాహ్నం ఆయన జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రిలో చేరారు. అయితే.. తాజాగా రజనీ కాంత్ ఆరోగ్యం పై లెటెస్ట్ మెడికల్ బులిటెన్ ను అపోలో ఆస్పత్రి వైద్యులు విడుదల చేశారు. ప్రస్తుతం రజనీ కాంత్ ఆరోగ్యం నిలకడగానే ఉందని.. ఆయన హై బిపితో ఇబ్బంది పడుతున్నారని హెల్త్ బులిటెన్‌లో వైద్యులు పేర్కొన్నారు. రజనీకాంత్‌కు ప్రస్తుతం వైద్య పరీక్షలు జరుగుతున్నాయని తెలిపారు. వైద్య పరీక్షల తర్వాత.. అన్నీ బాగుంటే ఆయనను సాయంత్రానికి డిశ్చార్జి చేస్తామని వైద్యులు తెలిపారు. రజనీకాంత్ ఆరోగ్య పరిస్థితిని ప్రత్యేక వైద్య బృందం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. రజనీకాంత్ ఆరోగ్య పరిస్థితిపై వాకబు చేసేందుకు ఎవరూ ఆసుపత్రికి రావద్దని వైద్యులు విజ్ఞప్తి చేశారు.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు