మస్కట్:తొలి విడతలో 7 వేల మందికి కోవిడ్ 19 వ్యాక్సిన్
- December 27, 2020
మస్కట్:పకడ్బందీ ఏర్పాట్ల మధ్య ఒమన్ లో కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. తొలి విడతలో 7,500 మంది పౌరులు, ప్రవాసీయులకు వ్యాక్సిన్ అందించనున్నారు. తొలి విడత వ్యాక్సినేషన్ కు సంబంధించి 15,600 వ్యాక్సిన్ డోసులు గత గురువారమే ఒమన్ చేరుకున్నట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. జనవరిలో మరో 28 వేల డోసులు ఒమన్ కు చేరనున్నాయి. ప్రతి ఒక్కరికి 21 రోజుల వ్యవధిలో రెండు డోసుల చొప్పున వ్యాక్సిన్ వేయాల్సి ఉంటుంది. అంటే ప్రస్తుతం 15 వేల డోసులు మాత్రమే అందుబాటులో ఉండటంతో 7,500 మందికి వ్యాక్సినేషన్ చేసేలా ఏర్పాట్లు చేశారు. తొలి విడతలో 65 ఏళ్ల కంటే ఎక్కువ వయసున్న వారితో పాటు దీర్ఘకాలంగా శ్వాసకోస ఇబ్బందులు, కిడ్నీ వ్యాధులు, ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో విధులు నిర్వహించే వైద్య సిబ్బందికి వ్యాక్సినేషన్ చేయనునున్నారు.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు