కింగ్డమ్ వెలుపల ప్రవాసీయుల రవాణాకు అనుమతిస్తూ ఎయిర్ లైన్స్ సంస్థలకు సౌదీ ఆదేశాలు

- December 28, 2020 , by Maagulf
కింగ్డమ్ వెలుపల ప్రవాసీయుల రవాణాకు అనుమతిస్తూ ఎయిర్ లైన్స్ సంస్థలకు సౌదీ ఆదేశాలు

రియాద్:కింగ్డమ్ వెలుపల నుంచి సౌదీయేతర, విదేశీ ప్రయాణికులను తీసుకువెళ్లేందుకు అనుమతిస్తూ సౌదీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు కింగ్డమ్ పరిధిలోని విమానయాన సంస్థలు, జనరల్ ఏవియేషన్ కు సర్క్యూలర్ జారీ చేసింది. విదేశీ విమాన సంస్థల విషయంలోనూ ఈ ఆదేశాలు వర్తించనున్నాయి. అయితే..కోవిడ్ 19 స్ట్రెయిన్ వైరస్ గా రూపాంతరం చెందిన దేశాలకు మాత్రం తమ కొత్త మార్గనిర్దేశకాలు వర్తించవని కూడా స్పష్టం చేసింది. బ్రిటన్ లో స్ట్రెయిన్ వైరస్ వ్యాపించటంతో ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా సౌదీ ప్రభుత్వం అంతర్జాతీయ విమానయానంపై ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. అయితే..ఆ ఆంక్షలను కొద్దిమేర సవరిస్తూ స్ట్రెయిన్ వైరస్ వ్యాప్తి చెందని దేశాల్లో విమాన సర్వీసులను పునరుద్ధరించేలా...అదీ కూడా సౌదీయేతర ప్రయాణికులను అనుమతిస్తూ తాజాగా ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు..విమాన సిబ్బంది ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయా దేశాల్లో గ్రౌండ్, ఆపరేషన్ సిబ్బందితో ఫిజికల్ కాంటాక్ట్ కావొద్దని కూడా సూచించింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com