వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్(VPN) వినియోగిస్తున్నారా? ఐతే ఈ జాగ్రత్తలు పాటించాల్సిందే!

- December 28, 2020 , by Maagulf
వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్(VPN) వినియోగిస్తున్నారా? ఐతే ఈ జాగ్రత్తలు పాటించాల్సిందే!

యూఏఈ:  మీరు యూఏఈ లో ఉంటూ వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్-వీపీఎన్ వినియోగదారులా? ఐతే..కొన్ని జాగ్రత్తలు, ప్రభుత్వ సూచనలు ఖచ్చితంగా పాటించాల్సిందే. కాదు..కూడదు అంటూ విరుద్ధంగా ప్రవర్తిస్తే 20 లక్షల దిర్హామ్ ల వరకు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. వీపీఎన్ వినియోగాన్ని యూఏఈ ప్రభుత్వం ఆమోదించటంతో చట్టబద్ధమే అయినా..ఐపీ ఆడ్రస్ సీక్రెట్ గా దాచినా..తప్పుడు సమాచారంతో వీపీఎన్ వినియోగించినా..ఇతరుల ఐడీలపై నెట్వర్క్ సేవలను వినియోగించినా యూఏఈ సైబర్ లా ప్రకారం నేరంగా పరిగణించనున్నట్లు ప్రభుత్వం హెచ్చరించింది. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా వీపీఎన్ వినియోగం పెరిగిపోతోంది. 2020లో తొలి అర్ధభాగంలోనే దాదాపు 3.82 మిలియన్ల మంది వీపీఎన్ ను డౌన్ లోడ్ చేసుకున్నారు. కాలింగ్, వెబ్ సైట్ యాక్సెస్, గేమింగ్ అప్లికేషన్స్ సేవలను వీపీఎన్ ద్వారా పొందెందుకు యూఏఈ అనుమతించింది. అయితే..తప్పుడు సమాచారం, ఐపీ అడ్రస్ వివరాలను దాచి అక్రమంగా వీపీఎన్ సేవలను వినియోగించటం, వీపీఎన్ సేవలను దుర్వినియోగం చేయటం నేరమని...యూఏఈ ప్రభుత్వం, టీఆర్ఏ మార్గనిర్దేశకాలను తప్పకుండా పాటించాలని ఆశిష్ మెహతా అసోసియేట్స్ మేనేజింగ్ పార్ట్ నర్ ఆశిష్ మెహతా వివరించారు. అలాగే విద్వేషక ప్రచారాలు, చట్టవ్యతిరేక ఆందోళనలకు మద్దతు కూడగట్టడం, అశ్లీల వెబ్ సైట్లను యాక్సెస్ చేయటం, నేరాల పాల్పడటం లేదా నేరాలకు ఇతరులను పురికొల్పడం వంటి చర్యలను ఉపేక్షించబోరు. నిబంధనలు ఉల్లంఘించిన వారికి సవరించిన సైబర్ చట్టం ఆర్టికల్ 1 మేరకు 50 వేల దిర్హామ్ ల నుంచి 2 లక్షల దిర్హామ్ ల వరకు జరిమానా విధించనున్నారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com