ఏడాది ముగిసేలోపు రెసిడెన్సీ వీసా రెన్యువల్‌ చేయించుకోవాలి

- December 28, 2020 , by Maagulf
ఏడాది ముగిసేలోపు రెసిడెన్సీ వీసా రెన్యువల్‌ చేయించుకోవాలి

కువైట్: రెసిడెన్సీ వీసా గడువు తీరుతున్నవారు, వాటిని వీలైనంత త్వరగా రెన్యువల్‌ చేయించుకోవాలని పబ్లిక్‌ అథారిటీ ఫర్‌ మేన్‌ పవర్‌ (పిఎఎం) సూచించింది. గురువారం లోపే తమ ట్రాన్సాక్షన్స్‌ని పూర్తి చేసుకోవాలనీ, రెండు వారాల పాటు ఈ సర్వీసుని సస్పెండ్‌ చేయనున్నారనీ సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. జనవరి 1 నుంచి 12 వరకు పబ్లిక్‌ అథారిటీ ఫర్‌ మేన్‌ పవర్‌, రెన్యువల్స్‌ని రద్దు చేయనుంది. ఆయా వ్యవహారాలు సజావుగా నడిచేందుకోసం జనవరి 12న ఆన్‌లైన్‌ సిస్టమ్‌ ప్రారంభించబడుతుంది. కరోనా నేపథ్యంలో ఎక్కువమంది ఒకే చోట గుమికూడటం అంత శ్రేయస్కరం కాదు గనుక, ఈ కోణంలో ఆన్‌లైన్‌ రెన్యువల్స్‌ని అందుబాటులోకి తెస్తున్నారు. కాగా, ఆన్‌లైన్‌ వెబ్‌సైట్‌ ద్వారా రెండు కొత్త సర్వీసుల్ని లాంచ్‌ చేస్తున్నారు. డాక్యుమెంట్ల తాలూకు డిజిటల్‌ కాపీల ప్రాసెసింగ్‌ వంటివి ఇందులో వున్నాయి. సేవల తాత్కాలిక సస్పెన్షన్‌ నేపథ్యంలో ఎలాంటి సమస్యలూ ఎదురుకాకూడదంటే, ఈ వారాంతంలోపు రెన్యువల్స్‌ చేయించుకోవాల్సి వుంటంఉది.  

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com