'డాన్స్ ప్లస్' లో మోనాల్
- December 28, 2020బిగ్‌బాస్ ముందు ఐదు తెలుగు సినిమాల్లో నటించిన హీరోయిన్ మోనాల్ గజ్జర్‌కు తర్వాత తెలుగులో అవకాశాలు రాలేదు. ఇక ఇంటికి తట్టా బుట్టా సర్దేయాలని అనుకుంటున్న సమయంలో ఆమెకు బిగ్‌బాస్ రూపంలో అదృష్టం తలుపు తట్టింది. తెలుగు రియాలిటీ షో బిగ్‌బాస్ సీజన్ 4లోని 16 మంది కంటెస్టెంట్స్‌లో మోనాల్ కూడా ఒకటి. బిగ్‌బాస్‌లో అభిజీత్, అఖిల్, మోనాల్ లవ్‌ట్రాక్ సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్‌గా నిలిచింది. షోలో మసాలా పోకూడదనే ఉద్దేశంతోనే బిగ్‌బాస్ నిర్వాహకులు కూడా ఆమెను దాదాపు చివరి వరకు బిగ్‌బాస్ హౌస్‌లో ఉండేలా చూసుకున్నారు. ఏదేతేనేం.. ఇప్పుడు బిగ్‌బాస్ 4 నుంచి వచ్చిన క్రేజ్‌ను మోనాల్ క్యాష్ చేసుకుంటుంది. అందులో భాగంగా ఓంకార్ నిర్వహించే డాన్స్ ప్లస్ అనే కార్యక్రమానికి మోనాల్ హోస్ట్‌గా కనిపించింది. చూడాలి మరి మోనాల్ డాన్స్ ప్లస్ ఎంత వరకు కలిసి వస్తుందో...!
తాజా వార్తలు
- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్
- టీఎస్ఆర్టీసీ ఎండీతో బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ భేటీ
- ఏపీలో 46,389 పోలింగ్ కేంద్రాలు..
- యూఏఈలో అనేక విమానాలు దారి మళ్లింపు, రద్దు
- AI సహాయంతో విద్యార్థుల ప్రొగ్రెస్ ట్రాక్..!
- సౌదీలో మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్..!
- సెకండరీ స్కూల్ గ్రాడ్యుయేట్లకు అడ్మిషన్లు ప్రారంభం
- షేక్ తహ్నౌన్ మరణంపై అమీర్ సంతాపం
- బీచ్‌లు, పబ్లిక్ పార్కులు, మార్కెట్లు మూసివేత
- కువైట్‌లో కోవిడ్-19 వ్యాక్సిన్ల దుష్ప్రభావాలు లేవు..!