కొత్త కరోనాపై కూడా సమర్ధవంతంగా పనిచేస్తుందిట ఆ టీకా

- December 28, 2020 , by Maagulf
కొత్త కరోనాపై కూడా సమర్ధవంతంగా పనిచేస్తుందిట ఆ టీకా

Oxford COVID vaccine: దేశమంతటా జనవరి నుంచి కోవిడ్ వ్యాక్సినేషన్‌ ప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ నేపథ్యంలో ఆక్స్‌ఫోర్డ్ యూనివర్సిటీ- ఆస్ట్రాజెనెకా కలిసి సంయుక్తంగా తయారు చేస్తున్న 'కొవిషీల్డ్' టీకా వైపు ఎక్కువగా ఔషధ నియంత్ర సంస్థలు మొగ్గు చూపిస్తున్నాయి. దేశీయంగా ఆక్స్‌ఫోర్డ్ టీకాను పూణేకు చెందిన సీరం సంస్థ రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆ సంస్ధ టీకా అనుమతులకు కావాల్సిన సమాచారాన్ని సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్(CDSCO)కి అందించిందని తెలుస్తోంది.

ఇదిలా ఉంటే తాజాగా ఆక్స్‌ఫోర్డ్ టీకాకు సంబంధించిన పలు కీలక విషయాలు ఓ కొత్త పరిశోధనలో వెలుగులోకి వచ్చాయి. ‘కొవిషీల్డ్’ వ్యాక్సిన్ 95 శాతం వరకు సమర్ధవంతంగా పని చేస్తోందని ఆ సంస్థ ప్రతినిధి పాస్కల్ సాయిరాట్ తెలిపారు. వైరస్‌ను కట్టడి చేయడంలో తమ వ్యాక్సిన్ సత్ఫలితాలను ఇస్తుందని పేర్కొన్నారు. అంతేకాకుండా బ్రిటన్‌లో వచ్చిన కొత్త కరోనా వేరియంట్‌కు వ్యతిరేకంగా కూడా ఈ వ్యాక్సిన్ పని చేస్తుందని తెలిపారు.

ప్రస్తుతం యూకేలో "కొవిషీల్డ్" టీకా అనుమతులు కోసం దరఖాస్తు చేసుకున్నామని… త్వరలోనే ఈ టీకాకు సంబంధించిన పూర్తి డేటాను బహిర్గతం చేస్తామని ఆయన అన్నారు. యూకేకి చెందిన ఎంహెచ్‌ఆర్‌ఏ అనే సంస్థ కొవిషీల్డ్‌కు అనుమతి ఇచ్చే ప్రక్రియను ఈ వారంలోపు పూర్తి చేసే అవకాశం ఉంది. ఒకవేళ ఆ ప్రాసెస్ వేగంగా పూర్తయితే.. ఇండియాలో కూడా ఈ వ్యాక్సిన్‌కు తొందరగానే అనుమతి వచ్చే అవకాశం ఉంది. ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ల లాగా ‘కొవిషీల్డ్’ను ఫ్రీజింగ్ ఉష్ణోగ్రతల వద్ద ఉంచాల్సిన అవసరం లేదు. ఇప్పటికే సీరం సంస్థ 4 కోట్ల డోసుల టీకాను సిద్ధం చేసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com