న్యుమోనియా వ్యాక్సిన్ విడుదల చేసిన మంత్రి హర్షవర్ధన్

- December 29, 2020 , by Maagulf
న్యుమోనియా వ్యాక్సిన్ విడుదల చేసిన మంత్రి హర్షవర్ధన్

న్యూఢిల్లీ: కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్ సీరం ఇనిస్టిట్యూట్‌ అభివృద్ధి చేసిన తొలి స్వదేశీ మొట్టమొదటి న్యుమోకాకల్ కంజుగేట్ వ్యాక్సిన్ ఖన్యుమోసిల్గను విడుదల చేశారు. బిల్, మెలిండా గేట్స్ ఫౌండేషన్ భాగస్వామ్యంతో సీరం వ్యాక్సిన్ను అభివృద్ధి చేసింది. కొవిడ్‌19 మహమ్మారి లాక్‌డౌన్‌ సమయంలో సీరం కంపెనీ ప్రభుత్వం నుంచి మొదటి స్వదేశీ న్యుమోకాకల్ కంజుగేట్ వ్యాక్సిన్ (పీసీవీ)ను అభివృద్ధి చేసి, లైసెన్స్ పొందిందని మంత్రి చెప్పారు.

ప్రధాని మోడి ‘ఆత్మనిర్భర్ భారత్’కు అనుగుణంగా తయారీ సాగిందని చెప్పారు. సీఐఐ మొట్టమొదటి స్వదేశీ న్యుమోకాకల్ కంజుగేట్ వ్యాక్సిన్ ‘న్యుమోసిల్’ బ్రాండ్ పేరుతో ఒకే మోతాదు (మందు సీసా, సిరంజి) సరసమైన ధరకే మార్కెట్లో లభిస్తుందని పేర్కొన్నారు. పరిశోధన, అభివృద్ధి, అధునాతన వ్యాక్సిన్ల తయారీలో భారతదేశ సామర్థ్యానికి న్యుమోసిల్ ఒక ఉదాహరణ అని పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఐదేళ్లలోపు పిల్లలలో మరణానికి న్యుమోనియా ప్రధాన కారణమని పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com