కరోనా కొత్త స్ట్రెయిన్.. భారత్‌లో 6 కేసులు నమోదు
- December 29, 2020
న్యూ ఢిల్లీ:బ్రిటన్ నుంచి కరోనావైరస్ కొత్త స్ట్రెయిన్ భారత్‌లో అడుగుపెట్టింది...ముందుగానే అప్రమత్తమైన ప్రభుత్వం..యూకే నుంచి విమానాసర్వీసులు నిలిపివేసింది.. అంతేకాదు.. ఈ నెలలో యూకే, యూకే మీదుగా భారత్‌కు వచ్చినవారిని గుర్తించిన కోవిడ్ టెస్ట్‌లు నిర్వహించారు.. ఇక, వీరిలో కోవిడ్ పాజిటివ్‌గా తేలినివారిని ఐసోలేషన్‌కు తరలించారు.. వారికి అత్యంత సన్నిహితంగా మెలిగినవారికి సైతం టెస్టులు నిర్వహించిన క్వారంటైన్లో పెట్టారు. మరోవైపు.. పాజిటివ్‌గా తేలినవారి శాంపిల్స్ అటు పుణెకు, ఇటు హైదరాబాద్‌లోని సీసీఎంబీకి తరలించారు. మొన్నే రిపోర్టులు వచ్చాని.. గోప్యంగా ఉంటాయి రాష్ట్రాలు.. ఆ నివేదికలను కేంద్ర ఆరోగ్యశాఖకు పపంపించాయి. మొతంగా ఇవాళ కొత్త కరోనా స్ట్రెయిన్ కేసులను ప్రకటించింది భారత ఆరోగ్యశాఖ... దేశ వ్యాప్తంగా ఇప్పటికే ఆరు కేసులు నమోదయినట్టు అధికారులు గుర్తించారు. బెంగళూరులో మూడు, హైదరాబాద్‌లో రెండు కేసులు నమోదు కాగా.. పుణెలో ఒక కేసులు వెలుగు చూసినట్టు కేంద్రం ప్రకటించింది. మరోవైపు.. అన్ని రాష్ట్రాలు అప్రమత్తమై.. యూకే నుంచి వచ్చినవారిపై ఫోకస్ పెట్టాయి.. ఇప్పటికే మెజార్టీ ప్రయాణికులను గుర్తించి టెస్ట్‌లు నిర్వహించగా.. కనబడకుండా పోయిన మరికొందరి కోసం వేట కొనసాగుతోంది.
తాజా వార్తలు
- సౌదీలో అక్రమ నివాసితులపై ఉక్కుపాదం.. వారంలో దాదాపు 15 వేల మంది అరెస్ట్..!!
- అక్రమ బరువు తగ్గించే మందులపై యూఏఈ ఉక్కుపాదం..!!
- ఒమన్ రియల్ ఎస్టేట్ రంగంలో కీలక సంస్కరణలు..!!
- కువైట్‌లో కల్తీ చేపలపై ఫుడ్ అథారిటీ కొరడా..!!
- ఖతార్‌లో సముద్ర రవాణా సేవలు పునరుద్ధరణ..!!
- భారత్, బహ్రెయిన్ మధ్య న్యాయ సహకారానికి కొత్త దిశ..!!
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్‌గా చాట్‌జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్‌ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’







