కరోనా కొత్త స్ట్రెయిన్.. భారత్‌లో 6 కేసులు నమోదు

- December 29, 2020 , by Maagulf
కరోనా కొత్త స్ట్రెయిన్.. భారత్‌లో 6 కేసులు నమోదు

న్యూ ఢిల్లీ:బ్రిటన్ నుంచి కరోనావైరస్ కొత్త స్ట్రెయిన్ భారత్‌లో అడుగుపెట్టింది...ముందుగానే అప్రమత్తమైన ప్రభుత్వం..యూకే నుంచి విమానాసర్వీసులు నిలిపివేసింది.. అంతేకాదు.. ఈ నెలలో యూకే, యూకే మీదుగా భారత్‌కు వచ్చినవారిని గుర్తించిన కోవిడ్ టెస్ట్‌లు నిర్వహించారు.. ఇక, వీరిలో కోవిడ్ పాజిటివ్‌గా తేలినివారిని ఐసోలేషన్‌కు తరలించారు.. వారికి అత్యంత సన్నిహితంగా మెలిగినవారికి సైతం టెస్టులు నిర్వహించిన క్వారంటైన్‌లో పెట్టారు. మరోవైపు.. పాజిటివ్‌గా తేలినవారి శాంపిల్స్ అటు పుణెకు, ఇటు హైదరాబాద్‌లోని సీసీఎంబీకి తరలించారు. మొన్నే రిపోర్టులు వచ్చాని.. గోప్యంగా ఉంటాయి రాష్ట్రాలు.. ఆ నివేదికలను కేంద్ర ఆరోగ్యశాఖకు పపంపించాయి. మొతంగా ఇవాళ కొత్త కరోనా స్ట్రెయిన్ కేసులను ప్రకటించింది భారత ఆరోగ్యశాఖ... దేశ వ్యాప్తంగా ఇప్పటికే ఆరు కేసులు నమోదయినట్టు అధికారులు గుర్తించారు. బెంగళూరులో మూడు, హైదరాబాద్‌లో రెండు కేసులు నమోదు కాగా.. పుణెలో ఒక కేసులు వెలుగు చూసినట్టు కేంద్రం ప్రకటించింది. మరోవైపు.. అన్ని రాష్ట్రాలు అప్రమత్తమై.. యూకే నుంచి వచ్చినవారిపై ఫోకస్ పెట్టాయి.. ఇప్పటికే మెజార్టీ ప్రయాణికులను గుర్తించి టెస్ట్‌లు నిర్వహించగా.. కనబడకుండా పోయిన మరికొందరి కోసం వేట కొనసాగుతోంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com