సౌదీ అరేబియా: మహిళా హక్కుల కార్యకర్త లౌజైన్ అల్ అతౌల్ కు ఐదేళ్ల జైలుశిక్ష

- December 29, 2020 , by Maagulf
సౌదీ అరేబియా: మహిళా హక్కుల కార్యకర్త లౌజైన్ అల్ అతౌల్ కు ఐదేళ్ల జైలుశిక్ష

రియాద్:సౌదీ అరేబియాలో మహిళా హక్కుల కోసం పోరాడుతున్న లౌజైన్ అల్ అతౌల్ కు రియాద్ సౌదీ క్రిమినల్ కోర్టు 5 ఏళ్ల 8 నెలల జైలు శిక్ష విధించింది. సౌదీ అరేబియాలో ప్రభుత్వాన్ని బలహీన పరిచటం, పాలనను మార్చేందుకు ప్రేరేపిస్తూ కుట్రలు చేస్తోందనే ఆరోపణలపై ఆమెకు జైలుశిక్షను ఖరారు చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా విదేశీ విధానాలను ప్రచారం చేయటమే కాకుండా తీవ్రవాద భావజాలాన్ని విస్తృతం చేసేందుకు ప్రయత్నిస్తున్నారనే ఆరోపణలపై లౌజైన్ ను గతంలోనే అరెస్టు చేసిన విషయం తెలిసిందే. 2017లోనే ఆమెపై టెర్రర్ క్రైమ్ లా అభియోగాలతో కేసు నమోదైంది. సౌదీ సామాజిక జీవన మూలాలను దెబ్బతీసేందుకు కుట్ర చేస్తున్నట్లు ఆమెపై ప్రభుత్వం ఆరోపిస్తోంది. ఇదిలాఉంటే..సౌదీ అరేబియాలో మహిళా హక్కుల కోసం లౌజైన్ చాలా కాలంగా పోరాడుతున్నారు. మహిళలకు కూడా డ్రైవింగ్ స్వేచ్చ కల్పించాలంటూ ఆమె ఉద్యమాన్ని చేపట్టడమే కాకుండా యూఏఈ నుంచి సౌదీకి స్వయంగా డ్రైవింగ్ చేసేందుకు సిద్ధపడ్డారు. మహిళలు డ్రైవింగ్ చేయకూడదన్న నిబంధనలను సౌదీ ప్రభుత్వం రద్దు చేసే నెల రోజులకు ముందే ఈ డ్రైవ్ చేపట్టారామె. దీంతో అప్పుడు కూడా లౌజైన్ అరెస్ట్ అయ్యారు.  

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com