'అల్లుడు అదుర్స్'లో మోనాల్ గజ్జర్ స్పెషల్ సాంగ్
- December 30, 2020
హైదరాబాద్:'రాక్షసుడు' లాంటి సూపర్ హిట్ మూవీ తర్వాత యంగ్ హీరో బెల్లంకొండ సాయిశ్రీనివాస్, 'కందిరీగ' ఫేమ్ సంతోష్ శ్రీనివాస్ డైరెక్షన్‌లో నటిస్తోన్న చిత్రం 'అల్లుడు అదుర్స్'. సుమంత్ మూవీ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుబ్రహ్మణ్యం గొర్రెల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
పర్‌ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ సినిమా షూటింగ్ ముగింపు దశలో ఉంది. సంక్రాంతి కానుకగా జనవరి 15న థియేటర్లలో విడుదల చేయడానికి చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది.
కాగా, 'బిగ్ బాస్ 4' ఫేమ్ మోనాల్ గజ్జర్ ఈ చిత్రంలో ఓ స్పెషల్ సాంగ్ చేయనున్నారు. ఆర్ట్ డైరెక్టర్ అవినాష్ కొల్లా ఆధ్వర్యంలో నిర్మించిన భారీ సెట్‌లో ఈ పాటను చిత్రీకరించనున్నారు. మాస్ ఆడియెన్స్‌ను ఉర్రూతలూగించే ఈ పెప్పీ నంబర్‌కు శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ అందిస్తున్నారు. దేవి శ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్న ఆ స్పెషల్ సాంగ్‌లో బెల్లంకొండ సాయిశ్రీనివాస్, మోనాల్ గజ్జర్‌తో పాటు చిత్రంలోని ప్రధాన తారాగణమంతా పాల్లొనబోతోంది.
పండగ సీజన్లలో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్ చూసేందుకు ప్రేక్షకులు ఇష్టపడతారు. ఈ సంక్రాంతికి 'అల్లుడు అదుర్స్' చిత్రం వారికి సరైన చాయిస్ అని కచ్చితంగా చెప్పవచ్చు.
బెల్లంకొండ సాయిశ్రీనివాస్ సరసన నాయికలుగా నభా నటేష్, అను ఇమ్మాన్యుయేల్ నటిస్తున్నారు. ప్రకాష్ రాజ్, సోను సూద్, వెన్నెల కిశోర్, సత్యా కీలక పాత్రధారులు.
రాక్‌స్టార్ దేవి శ్రీప్రసాద్ సంగీతం సమకూరుస్తుండగా, చోటా కె. నాయుడు సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు.
తారాగణం:
బెల్లంకొండ సాయిశ్రీనివాస్, నభా నటేష్, అను ఇమ్మాన్యుయేల్, ప్రకాష్ రాజ్, సోను సూద్, వెన్నెల కిశోర్, సత్యా, మోనాల్ గజ్జర్ (స్పెషల్ అప్పీరెన్స్)
సాంకేతిక బృందం:
డైరెక్టర్: సంతోష్ శ్రీనివాస్
నిర్మాత: సుబ్రహ్మణ్యం గొర్రెల
సమర్పణ: రమేష్ కుమార్ గంజి
మ్యూజిక్: దేవి శ్రీప్రసాద్
సినిమాటోగ్రఫీ: చోటా కె. ప్రసాద్
ఎడిటింగ్: తమ్మిరాజు
ఆర్ట్: అవినాష్ కొల్లా
యాక్షన్: రామ్-లక్ష్మణ్
పీఆర్వో: వంశీ-శేఖర్
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు