రోడ్డు ప్రమాదంలో అజారుద్దీన్‌కు గాయాలు..
- December 30, 2020
టీం ఇండియా మాజీ క్రికెటర్ మహ్మద్ అజారుద్దీన్‌కు త్రుటిలో ఘోర ప్రమాదమే తప్పింది. న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో అజారుద్దీన్ బుధవారం తన కుటుంబ సభ్యులతో కలిసి రాజస్థాన్‌కు బయలు దేరారు. అయితే.. రాజస్థాన్‌లోని సుర్వార్కు చేరుకోగానే ఆయన కారు అదుపు తప్పి పక్కనున్న ధాబాలోకి దూసుకెళ్లి... పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో అజారుద్దీన్‌కు స్వల్ప గాయాలయ్యాయి. అటు ఆయన కుటుంబ సభ్యులు మాత్రం క్షేమంగా బయట పడ్డారు. ధాబాలో పనిచేస్తున్న ఇషాన్ అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఇది ఇలా ఉండగా.. ప్రమాదం జరిగిన వెంటనే క్రికెటర్ అజారుద్దీన్ మరో వాహనంలో హోటల్‌కు వెళ్లిపోయారు. డ్రైవర్ బ్రేక్ వేసే సమయంలో వాహనం అదుపు తప్పి ఈ ప్రమాదం జరిగి ఉంటుందని స్థానికులు అంటున్నారు. అయితే.. దీనిపై పోలీసులు విచారణ చేపడుతున్నారు.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష