కరోనా కొత్త స్ట్రెయిన్: జనవరి 31 వరకు విమానాలు బంద్..
- December 30, 2020
కరోనా వైరస్ తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరుగుతోంది.. మరోవైపు.. కరోనా కొత్త స్ట్రెయిన్ ఇప్పుడు అన్ని దేశాలను కలవరపెడుతోంది.. భారత్‌లోనూ కరోనా కేసులతో పాటు.. కొత్త స్ట్రెయిన్ కేసులు కూడా టెన్షన్ పెడుతున్నాయి.. దీంతో పౌర విమానయాన మంత్రిత్వశాఖ కీలక నిర్ణయం తీసుకుంది.. అన్ని అంతర్జాతీయ విమాన సర్వీసులను 2021 జనవరి 31 వరకు నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది.. అంతర్జాతీయ విమానాలు జనవరి 31 వరకు నిలిపివేస్తున్నట్టు కేంద్రం తన ప్రకటనలో పేర్కొంది. అయితే, ప్రత్యేక విమానాలు మరియు అంతర్జాతీయ ఎయిర్ కార్గో సర్వీసులకు ఈ ఆంక్షలు వర్తించబోవని స్పష్టం చేసింది.
కాగా, కోవిడ్ 19 వ్యాప్తిని అరికట్టడానికి మార్చి చివరి వారంలో భారతదేశం అన్ని విమాన కార్యకలాపాలను నిలిపివేసింది. రెండు నెలల విరామం తర్వాత కఠినమైన నిబంధనలు పెడుతూ మే నెలలో దేశీయ విమాన కార్యకలాపాలు తిరిగి ప్రారంభమయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా చిక్కుకున్న భారతీయులను తిరిగి తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం మే 6వ తేదీ నుంచి వందే భారత్ మిషన్ ప్రారంభించింది... ఎయిరిండియా మరియు అనేక ఇతర ప్రైవేట్ దేశీయ విమానయాన సంస్థలు వందే భారత్ మిషన్ కోసం విమానాలను నడుపుతున్న విషయం తెలిసిందే. అయితే, ఆ తర్వాత విమానసర్వీసులు ప్రారంభమైనా.. కరోనా స్ట్రెయిన్ ఎఫెక్ట్‌తో మళ్లీ రద్దు చేశారు.
తాజా వార్తలు
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్‌టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!
- మస్కట్‌లో వీధుల పేర్లు, చిరునామాల ధృవీకరణ 80 శాతం పూర్తి..!!
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ
- బంగారం కొనవద్దని ప్రధాని మోదీ చెప్పడానికి అసలు రహస్యం ఇదే !!
- నేడు వైఎస్సార్ 17వ వర్ధంతి
- ఇరాన్ పై అమెరికా ప్రతీకార దాడులతో మళ్లీ ఉద్రిక్తతలు
- పబ్లిక్ ప్లేస్‌లలో స్మోకింగ్..అల్-ముబారకీయాలో 30 కేసులు..!!
- పర్యాటకులకు థాయ్‌లాండ్ షాక్.. 60కి పైగా దేశాలకు వీసా ఫ్రీ స్టే కుదింపు..!!
- సౌదీ అరేబియాలో 2026–27 హంటింగ్ సీజన్ ప్రారంభం..నిబంధనలు కఠినం..!!







