ఆర్థిక నేరం: నలుగురి అరెస్ట్

- December 30, 2020 , by Maagulf
ఆర్థిక నేరం: నలుగురి అరెస్ట్

ఒమాన్: రాయల్ ఒమన్ పోలీస్, నలుగురు వ్యక్తుల్ని ఫోర్జరీ మరియు పెద్ద మొత్తంలో డబ్బుని అపహరించిన కేసులో అరెస్ట్ చేయడం జరిగింది. బ్యాంకు ఫిర్యాదుతో నిందితుల్ని అరెస్ట్ చేసినట్లు రాయల్ ఒమన్ పోలీస్ పేర్కొంది. బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు ఈ తరహా నేరాల పట్ల అప్రమత్తంగా వుండాలని ఒమన్ పోలీస్ సూచించారు. గత వారం ఒమన్ అరబ్ బ్యాంక్ ఎంఎస్ఎం ఫైలింగ్ సంబంధిత క్రిమినల్ ఫిర్యాదు చేయడం జరిగింది. 6 మిలియన్ ఒమన్ రియాల్స్ మేర ఫోర్జరీ, నిధుల అపహరణ కేసు నమోదు చేసినట్లు ఒమన్ అరబ్ బ్యాంక్ వెల్లడించింది. సంబంధిత అథారిటీస్ విచారణ చేపడుతున్నట్లు బ్యాంకు పేర్కొంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com