'వాహనరహిత దినోత్సవం' లో ఉత్సాహంగా పాల్గొన్న దుబాయ్ నివాసితులు
- February 21, 2016వందలాదిమంది ప్రజలు ఎంతో ఉత్సాహంగా పర్యావరణ స్నేహపూర్వక వాహనాలతో దుబాయ్ లో సందడి చేశారు, స్థానిక మునిసిపాలిటి నిర్వహించిన ' కారు అవసరం లేని ఉచిత ప్రదర్శనకు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఆదివారం జరిగిన ఈ కార్యక్రమంలో అసమా అల్ మర్రి అనే మహిళ అల్ రాశిదియ నుండి మెట్రో ఎక్కి దుబాయ్ మునిసిపాలిటికి వచ్చారు. ప్రబుత్వ, ప్రైవేటు, పోలీస్, అంబులెన్సు తో సహా ఈ కారు అవసరం లేని కార్యక్రమంలో పాల్గొనడం చూడటానికి ఎంతో ఘనతగా ఉందని ఆమె అన్నారు. తాను ఉద్యోగ విధులకు వెళ్ళేటప్పుడు తన స్వంత కారులోనే వెళతానని, అందుకు కారణం తనకు 9 నెలల వయసున్న చిన్నారి ఉందని , ఆ బిడ్డకు అవసరమైన సరంజామాను తాను కారులో ఉంచుకొంటానని అందుకే తాను కారును ఉపయోగిస్తున్నట్లు లేదంటే తాను ఎల్లప్పుడు మెత్రోలోనే ప్రయాణిస్తానని ఆమె తెలిపారు. దుబాయ్ మునిసిపాలిటీలో ఉద్యోగినిగా పనిచేస్తున్నానని గత 7 ఏళ్ళుగా దుబాయ్ మునిసిపాలిటి నిర్వహిస్తున్న ' వాహనరహిత దినోత్సవం ' కారణంగా ప్రజలలో పర్యావరణం పట్ల ఎంతో అవగాహన పెరిగిందని అన్నారు. ఈ తరహా అవగాహన కారణంగా కార్బన్ డై ఆక్సైడ్ విడుదలను కొంత మేరకు తగ్గించడానికి సహాయపడుతుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..







