గల్ఫ్ సమస్యలపై మంత్రి కేటీఆర్ ను కలిసిన వలస కార్మిక నాయకులు
- December 30, 2020
హైదరాబాద్:గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి, సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని వలస కార్మిక నాయకుల బృందం బుధవారం మంత్రి కేటీఆర్ ను ప్రగతి భవన్ లో కలిసి వినతిపత్రం సమర్పించారు. పాటుకూరి బసంత్ రెడ్డి, మంద భీంరెడ్డి, గన్నారం ప్రశాంత్ లు కేటీఆర్ ను కలిసినవారిలో ఉన్నారు.
'తెలంగాణ గల్ఫ్ కార్మికుల సంక్షేమం బోర్డు' (గల్ఫ్ బోర్డు) ఏర్పాటు చేయాలని, సంక్షేమానికి రూ.500 కోట్ల బడ్జెట్ కేటాయించాలని, గల్ఫ్ మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల ఆర్థిక సహాయం చేయాలని బృందం విజ్ఞప్తి చేసింది.
కొత్తగా గల్ఫ్ వెళ్ళే కార్మికులకు కనీస వేతనాలు (మినిమమ్ రెఫరల్ వేజెస్) 30 నుండి 50 శాతం తగ్గిస్తూ భారత ప్రభుత్వం సెప్టెంబర్ లో జారీచేసిన రెండు సర్కులర్లను వెంటనే రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని కోరారు.
తాజా వార్తలు
- ఎయిర్ ఇండియా ఫ్లైట్: ప్రయాణికుడు చేసిన పనికి హడలి పోయిన పైలట్..
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!
- పాలస్తీనాను గుర్తించిన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్..!!
- యూఏఈలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీలను నిషేధించిన స్కూల్స్..!!
- నివాస ప్రాంతాలలో బ్యాచిలర్ హౌసింగ్.. కఠిన చర్యలు..!!
- మసాజ్ పార్లర్ల ద్వారా మనీలాండరింగ్..!!
- స్వదేశానికి తిరిగి వచ్చిన సయ్యిద్ బిలారబ్..!!
- షేక్ హ్యాండ్ ఇద్దాం రండీ..టీమ్ఇండియా ఆటగాళ్లను కోరిన గంభీర్
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు
- జీఎస్టీ 2.0పై సీఎం చంద్రబాబు స్పందన..